ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-09-2022 మంగళవారం దినఫలాలు - గౌరిదేవిని ఆరాధించినా మనోసిద్ధి

astro8
మేషం :- ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. విందు, విలాసాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. వృత్తులు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
వృషభం :- ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
 
మిథునం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు అధిక శ్రమ తప్పదు. ఖర్చులు అధికం అయినా సంతృప్తి ప్రయోజనం పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు నిర్లిప్తత ధోరణి వల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. భాగస్వామిక చర్చలు, స్థిరాస్తి వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
కర్కాటకం :- రావలసిన పత్రాలు చేతికందుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమ, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పదు. ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
సింహం :- ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రతి విషయంలోను నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియచేయండి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఎరువులు, క్రిమి సంహారక మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం.
 
కన్య :- స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహరాలకు సంబంధించిన విషయాలలో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. విద్యార్థులకు విద్యావిషయాలలో ఏకాగ్రత ముఖ్యం. ఖర్చులు మీ రాబడికి మించటం వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు.
 
తుల :- ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. స్పెక్యులేషన్ రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు సభలు, సత్కార్యాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి.
 
వృశ్చికం :- కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. 
 
ధనస్సు :- స్త్రీలు సాహస కార్యాలకు దూరంగా ఉండటం మంచిది. కంది, ఎండుమిర్చి, ధనియాలు, బెల్లం, ఆవాలు స్టాకిస్టులకు, వ్యాపారులకు కలిసిరాగలదు. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు సమస్యలకు దారితీయవచ్చు జాగ్రత్త వహించండి. ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి.
 
మకరం :- చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఆధ్యాత్మిక చింతన, ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. రుణాల కోసం అన్వేషిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. రావలసిన ధనం ఆలస్యంగా చేతి కందుతుంది.
 
కుంభం :- మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల మంచిగుర్తింపు, రాణింపు లభిస్తుంది. క్రయ, విక్రయ రంగాల్లో వారికి సామాన్యం. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం. 
 
మీనం :- ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల మెప్పు కోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఒక విషయంలో ఆప్తుల సలహా పాటించ నందుకు కించిత్ పశ్చాత్తాపం చెందుతారు.