సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-04-2023 తేదీ శనివారం దినఫలాలు - శ్రీరామును పూజించిన శుభం...

Astrology
మేషం :- రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. వృత్తి, ఉద్యోగాలలో వారికి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ఖర్చులకు సరిపడ ధనం సమకూరుట వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూఉండదు.
 
వృషభం :- గృహంలో మార్పులకు, చేర్పులకు వాయిదా పడతాయి. స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాలపట్ల ఆసక్తి పెరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జార విడచుకుంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
మిథునం :- ప్రయాణాలలో వస్తువుల జాగ్రత్త అవసరం జాగ్రత్త. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. రచయితలకు, పత్రికా రంగాల వారికి సామాన్యం. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చడం వల్ల మాటపడవలసి వస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలవాకి అనుకూలం. క్రీడా రంగాల వారికి చికాకుల తప్పవు.
 
కర్కాటకం :- ఎలక్ట్రికల్ రంగాలలొ వారికి సామాన్యంగా ఉండగలదు. మీ సంతాన విషయంలో సంతృప్తి కానవస్తుంది. దూరంలో ఉన్న వ్యక్తుల గురించి ముఖ్యమైన సమాచారం అందుకుటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి మిశ్రమ ఫలితం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అధిక శ్రమ, చికాకులు తప్పవు. 
 
సింహం :- మీ పాత సమస్యలు పరిష్కరింపబడతాయి. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఉద్యోగ వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. అనురాగ వాత్సల్యాలు పొందగలవు. ప్రయాణాలలో కొంత ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
కన్య :- స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత అవసరం. బ్యాంకింగ్ వ్యవహరంలో జాగ్రత్త అవసరం. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.
 
తుల :- బంధువుల నుంచి వ్యతిరేకత, పట్టింపులు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు ఎదుర్కోవలసివస్తుంది. మొక్కుబడులు తీర్చుకుంటారు. రావలసిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చగలుగుతారు. మార్కెటింగ్ రంగలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు.
 
వృశ్చికం :- మీ సంతానం వివాహం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఒక స్థాయివ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంగారు, వెండి, వస్త్ర రంగాలలో వారికి మెళుకువ అవసరం. దంపతుల మధ్య కలహాలు, పట్టింపులు ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. క్రయ విక్రయ రంగాలలో వారికి అనుకూలం.
 
మకరం :- మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. వ్యాపారవర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. వాహన చోదకులకు చికాకులు తప్పవు.
 
కుంభం :- వైద్య రంగాలలో వారికి శుభకార్యములకై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు రావలసిన క్లెయిములు మంజూరవుతాయి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
మీనం :- రవాణా రంగంలోని వారికి లాభదాయకం. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, బ్రోకర్లకు, ఎగుమతుల వ్యాపారస్థులకు వారి వారి రంగాలలో విజయం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఆత్మీయులను విమర్శించుట వలన చికాకులను ఎదుర్కొంటారు.