బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By వరుణ్

22-07-2023 శనివారం రాశిఫలాలు - అనంతపద్మనాభ స్వామిని పూజించిన శుభం...

Pisces
మేషం :- ఉద్యోగస్తులు ఓర్పుతో వ్యవహరిస్తారు. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి.
 
వృషభం:- భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి పనులు కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి.
 
మిథునం :- మీ సంతానం చదువుల విషయంలోసంతృప్తి కానవస్తుంది. ఉద్యోగస్తులు అధిక శ్రమ, ఒత్తిడికి లోనవుతారు. సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. కోర్టు విషయాల్లో ప్రతికూలత తప్పకపోవచ్చు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. స్టేషనరీ, ప్రింటింగు రంగాలలో వారికి అనుకూలం.
 
కర్కాటకం :- ఉమ్మడి నిధుల నిర్వహణలో ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. స్పెక్యులేషన్, ఎలక్ట్రానికల్, ఎలక్ట్రికల్ రంగాల వారికి కలిసివచ్చును.
 
సింహం :- ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. కొబ్బరి పండ్లు, పూలు వ్యాపారులకు లాభదాయకం. ప్రతి విషయంలోను స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది. వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
 
కన్య :- ఇంజనీరింగ్, వైద్య రంగాల పట్ల ఆసక్తి పెరుగును. సిమెంట్, ఇసుక, ఇటుక, తాపి పనివారికి అభివృద్ధి. క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. సినిమా రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది.
 
తుల :- రవాణా రంగాలలో వారికి లాభదాయకం. అన్ని రంగాలలోని స్త్రీలకు చాలా యోగప్రదంగా వుండగలదు. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగి ఉన్న పనులు పునప్రారంభమవుతాయి. సోదరి సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది.
 
వృశ్చికం :- ప్రచురణ, పత్రికా రంగంలోని వారికి మందకొడిగా ఉండగలదు. కళాంకారీ రంగాలలోవారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విదేశాలు వెళ్లుటకు చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్టాకిస్టులకు, బ్రోకర్లకు, ఏజెంట్లకు అనుకూలం. స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం.
 
ధనస్సు :- ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఐరన్, ఆల్కహాల్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు అందుతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
 
మకరం :- వస్త్ర వెండి, బంగారం వ్యపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. బంధువర్గాలతో గృహంలో సందడి నెలకొంటుంది. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం పై చదువుల కోసం విదేశాలు వెళ్తారు.
 
కుంభం :- ఆర్థిక లావాదేవీలు అనుకున్న విధంగా లాభిస్తాయి. వ్యాపార విషయములయందు జాయింట్ సమస్యలు రావచ్చును. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మీనం :- వ్యాపారాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్థులు అధికారులకు విలువైన కానుకలు అందజేసి వారిని ప్రసన్నం చేసుకుంటారు. భూమి, ఇండ్ల వ్యాపారులకు ప్రభుత్వరీత్యా ధనము ఆదాయము బాగుండును. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.