1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. రెట్టించిన ఉత్సాహంతో యత్నాలు సాగిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. అవకాశం చేజారిపోతుంది. మీ సమర్థత మరొకరికి లాభిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. చేపట్టిన పనులు సాగవు. సంతానం ధోరణి చికాకుపరుస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. విందుకు హాజరవుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాన్ని సమర్ధంగా నిర్వహిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పనులు అర్థాంతంగా నిలిపివేస్తారు. ఖర్చులు విపరీతం. ప్రయాణం విరమించుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
లావాదేవీలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిస్తేజానికి గురవుతారు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. పిల్లలకు శుభం జరుగుతుంది. దూరప్రయాణం తలపెడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఖర్చులు సామాన్యం. సన్నిహితులకు సాయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనుల్లో ఒత్తిడి అధికం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఓర్పుతో వ్యవహరించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆశావహదృక్పథంతతో యత్నం సాగించండి. దుబారా ఖర్చులు అధికం, కొత్త పనులు మొదలెడతారు.. అనవసర జోక్యం తగదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు.