శ్రీ క్రోధినామ సం|| వైశాఖ ఐ|| విదియ సా.6.37 జ్యేష్ట ఉ. 10.35 సా.వ. 6.38 ల 8.14. ఉ.దు.5.37 ల 7.18.
మేషం :- ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటివ్‌లకు పనిభారం వల్ల ఆరోగ్యంలో చికాకులు ఎదుర్కోక తప్పదు. భాగస్వామిక వ్యాపారాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో మెళకువ వహించండి. పీచు, ఫోమ్, లెదర్, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. స్త్రీలు తమ ఆధిక్యతను చాటుకునే యత్నాలలో ఇబ్బందులెదుర్కోక తప్పదు.
వృషభం :- దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన విషయాల్లో మెళకువ వహించండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
మిథునం :- మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి వ్యాపారులకు, స్టాకిస్టులకు వేధింపులు అధికమవుతాయి. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. బ్యాంకింగ్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
కర్కాటకం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వర్టర్, ఏసీ మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం :- రుణం తీర్చటానికై చేయుయత్నాలు వాయిదా పడతాయి. ప్రేమికుల మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోయి ప్రేమానుబంధాలు బలపడతాయి. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. మీ ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు జాగ్రత్త వహించండి.
కన్య :- గృహంలో మార్పులు, చేర్పులకై చేయుయత్నాలలో ఆటంకాలు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటుకాగలదు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. బంధువర్గాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు.
తుల :- మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. బంధువుల రాక, అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయటం క్షేమదాయకం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు.
వృశ్చికం :- హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. చిన్నతరహా, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అంతగా అనుకూలించవు. స్త్రీల అసంతృప్తి ధోరణి వల్ల కుటుంబంలో ప్రశాంతత కరువవుతుంది.
ధనస్సు :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. సినిమా రంగాలలో వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలలో సఫలీకృతులవుతారు. వస్త్ర, బంగారం, వెండి, రత్న వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. క్రయ విక్రయ రంగాలపట్ల ఏకాగ్రత వహిస్తారు.
మకరం :- ఇతరులను గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. ఉద్యోగస్తులకు తోటివారి ద్వారా ఆసక్తికరమైన వార్తలు అందుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తికరంగా ఉంటుంది.
కుంభం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. రావలసిన ధనంలో కొంత భాగా వసూలు కాగలదు. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ మరమ్మతులుచేపడతారు.
మీనం :- బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. ఏజెంట్లకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు లాభదాయకం.