సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-12-2024 గురువారం దినఫలితాలు : విలాసాలకు వ్యయం చేస్తారు...

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. ఆహ్వానం అందుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. కీలక పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రయాణం తలపెడతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. అదృష్టయోగమే మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. పనుల్లో ఒత్తిడి అధికం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. నిలిపివేసిన ఖర్చులు సామాన్యం. పనులు పునఃప్రారంభిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్నవిషయానికే ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు సాగవు. అపరిచితులతో జాగ్రత్త. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. కీలకపత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. రావలిసిన ధనం అందుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. సంకల్పబలమే మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచింపవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి వాహనయోగం ఉన్నాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంసాదిస్తారు.