గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-04-2023 తేదీ ఆదివారం దినఫలాలు - విష్ణు సహస్రనామం చదివితే శుభం..

Leo
మేషం :- తోటల రంగాల వారికి చికాకులు తప్పవు. ఉన్నత విద్యల నిమిత్తం చేసే విదేశీయాన యత్నం ఫలిస్తుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పండ్ల, పూల, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు.
 
వృషభం :- కుటుంబీకులతో కలసి విందు, వేడుకలలో పాల్గొంటారు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
మిథునం :- స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తగలవు. జాగ్రత్త వహించండి. అవసరమైన వస్తువులు సమయానికి కనిపించకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. క్రీడా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది.
 
కర్కాటకం :- కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. నూతన ప్రదేశాల పట్ల ఆశక్తి అధికమవుతుంది. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి సలహా పాటించడం మంచిదని గమనించండి.
 
సింహం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించిన సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సహయ సహకారాలు అందిస్తారు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది.
 
కన్య :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. విద్యార్థుల మితిమీరిన ఉత్సాహం వల్ల సమస్యలు తప్పవు. మీ సంల్పసిద్ధికి నిరంతరం శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. పూర్వానుభవంతో ముందుకు సాగుతారు.
 
తుల :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దూరప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
వృశ్చికం :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. రవాణా రంగాల వారికి ప్రయాణీకుల తీరు ఆందోళన కలిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకమైన కాలం. 
 
ధనస్సు :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు ఆశించినంత సంతృప్తి కానరాదు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాలో చికాకులు అధికం.
 
మకరం :- ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగవు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి.
 
కుంభం :- క్రీడా, కళా, సాంస్కృక రంగాల పట్ల ఆశక్తి వహిస్తారు. దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చికాకులను ఎదుర్కొంటారు.
 
మీనం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. దైవ కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు వినవలసి వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు.