బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 31 జులై 2024 (09:26 IST)

31-07-2024 - బుధవారం మీ రాశి ఫలితాలు - తెలిసి తెలియక చేసిన?

శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ బ॥ ఏకాదశి సా.5.23 రోహిణి ప.12.37 ఉ.శే.వ.6.25 కు సా.వ.6.07 ల 7.42. ప. దు. 11. 37 ల12.30.
 
మేషం: ఆర్థిక చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. రాజకీయ నాయకులు తాము చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తారు. ప్రతి విషయంలోను నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
వృషభం:- నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతారు. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కొంటారు. వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్త్రీలకు విదేశీ వస్తువులు, అలంకరణలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
మిధునం:– భాగస్వామిక, సొంత వ్యాపారాలల్లో ఏకాగ్రత అవసరం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. గృహ నిర్మాణాలు, మరమ్మతుల్లో ఏకాగ్రత అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు మందకొడిగా సాగుతాయి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలుఅనుకూలిస్తాయి.
 
కర్కాటకం:- దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. ఎక్సుపోర్టు వ్యాపారులకు కలిసివచ్చేకాలం. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొజ్జెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానరాదు. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధికానవస్తుంది.
 
సింహం:- రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సామాన్యం. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.
 
కన్య:- ఆర్ధిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధి పొందాలని యత్నిస్తారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన వస్తుసామగ్రి అందజేస్తారు.
 
తుల:- ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని ఖర్చులవల్ల అధిక ధనవ్యయం తప్పదు. శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళుకువ అవసరం. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. శత్రువులను ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం:- బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు రావలసిన అరియర్స్, అడ్వాస్సులు మంజూరవుతాయి. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
ధనస్సు:- నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. ఆటోమోబైల్, ట్రాన్సుపోర్టు రంగాలలో వారికి జయం చేకూరును. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి.
 
మకరం:- వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందుల, ఆల్కహాలు వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. నూతన పరిచయాలేర్పడతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.
 
కుంభం:- ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. విదేశీయానం, రుణ యత్నాల్లో చికాకులు తప్పవు. మార్కెటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పవు. సోదరీ, సోదరులతో ఏకీభవిచలేకపోతారు. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి.
 
మీనం:- రాజకీయాలలోని వారు ఆచి తూచి వ్యవహరించవలెను. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని ఫలితం దక్కుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులు పడుట వల్ల మాటపడకతప్పదు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి.