శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-02-2022 బుధవారం రాశిఫలితాలు - సత్యదేవుని పూజించి అర్చించినా...

మేషం :- ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారుల మెప్పు పొందుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం మంచిదికాదు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
వృషభం :- వృత్తుల వారి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. విద్యార్థుల మితిమీరిన ఉత్సాహం వల్ల సమస్యలు తప్పవు. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యుత్ రంగాల్లో వారికి ఆందోళన తప్పదు. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మిథునం : - ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, మెకానికల్ రంగాల వారికి స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. ఊహించని ఖర్చులు వల్ల చేబదుళ్ళు తప్పవు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించండి. 
 
కర్కాటకం :- పాత పరిచయాలు, సంబంధబాంధవ్యాలు మరింత బలపడతాయి. ముఖ్యమైన విషయాలు కుటుంబీకులకు తెలియజేయడం మంచిది. దంపతుల మధ్య కలహాలు, విభేదాలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
సింహం :- లీజు, ఏజెన్సీ వ్యవహారాలలో పెద్దల సలహా పాటించటం శ్రేయస్కరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల మాటపడవలసి వస్తుంది. మీ పెద్దల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- వ్యాపారానికై చేయుప్రయత్నాలు అనుకూలించగలవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ధన వ్యయం విపరీతంగా ఉన్న సార్థకత ఉంటుంది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపులభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు.
 
తుల :- మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల రాక వల్ల గృహంలో కొంత అసౌకర్యానికి లోనవుతారు. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. నిరుద్యోగులకు ఆశాజనంకంగా ఉంటుంది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదా పడుట మంచిది. 
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లు నూతన టెండర్ల విషయంలో మెళకువ అవసరం. విరామ కాలక్షేపాల ద్వారా ఊరట పొందుతారు. సాహసించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. మార్కెటింగ్ రంగాల్లో వారు, రిప్రజెంటిన్లు ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించడం వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు వాయిదా పడటం మంచిది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. వాహనం పై ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
మకరం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బిల్లులు చెల్లిస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ముందుచూపుతో వ్యవహరించుట మంచిది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.
 
కుంభం :- పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులకు స్థానమార్పిడికి అవకాశం ఉంది. ఏ విషయంలోనూ మొహమాటాలకు పోకుండా మీ నిర్ణయం ఖచ్చితంగా తెలియజేయటం శ్రేయస్కరం. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. బంధువుల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. 
 
మీనం :- ఉపాధ్యాయులకు శ్రమ అధికం. ఆపదసమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రేమికులకు మధ్య ఎడబాటు తప్పదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చికాకులు అధికమవుతాయి.