గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-04-22 సోమవారం రాశిఫలాలు - విష్ణుమూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన..

astro2
మేషం :- మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించటం మంచిది.
 
వృషభం :- స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తి సాగుతాయి. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. కోపంతో పనులు చక్కబెట్టలేరు.
 
మిథునం :- ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఉమ్మడి వ్యాపారాలు లాభదాయకంగా ఉండగలవు. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవం కుదరదు.
 
కర్కాటకం :- ముఖ్యుల నుండి ధన సహాయం లభించడంతో ఒకడుగు ముందుకు వేస్తారు. వ్యవసాయ, తోటల రంగాలలో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. అలౌకిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. దూర ప్రయాణాలు మీకు అనుకూలించగలవు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది.
 
సింహం :- సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. సోదరుల మధ్య సంబంధ భాంధవ్యాలు బాగుగా ఉంటాయి.
 
కన్య :- మార్కెటింగ్ రంగలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్న వారు సైతం అనుకూలంగా మారతారు. భాగస్వామిక వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు.
 
తుల :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. కోర్టు పనులు కొంత మందకొడిగా సాగుతాయి. మిత్రులను కలుసుకుంటారు. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది.
 
వృశ్చికం :- నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
ధనస్సు :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. క్రయ, విక్రయ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అధికారుల కలయిక సంతృప్తినిస్తుంది. సినిమా, సాంస్కృతిక రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. పెద్దలతోను, ప్రముఖులతోను ఏకీభవించలేరు. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యము మందగిస్తుంది.
 
మకరం :- పొగడ్తలు, విమర్శలను హుందాగా స్వీకరిస్తారు. ఇంట్లో వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తారు. దైవ కారక్రమాల్లో పాల్గొంటారు. మీ శ్రీమతి మొండి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. 
 
కుంభం :- ఎవరికీ పెద్దమొత్తంలో నగదు చెల్లింపు మంచిది కాదు. మీ వ్యవహార జ్ఞానం, పట్టుదల కొంతమందికి స్ఫూర్తినిస్తుంది. నూతన దంపతులు కొత్త అనుభూతికి లోనవుతారు. బంధు మిత్రుల రీత్యా కొత్త సమస్యలు తలెత్తగలవు. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం.
 
మీనం :- రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సూతన వెంచర్లు అనుకూలిస్తాయి. విద్యార్థులు వాహనాన్ని ఏకాగ్రతతో నడపటం క్షేమదాయకం. దూర ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆదాయ వ్యయాలకు ఏ మాత్రం పొంతన ఉండదు.