గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

27-12-2021 సోమవారం దినఫలాలు - పార్వతీదేవిని ఎర్రని పూలతో...

మేషం :- కొబ్బరి, పండ్ల, పూల, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు ఆకస్మికంగా పొట్ట, తలకి సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. రావలసిన ధనం సకాలంలో అందుట వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు.
 
వృషభం :- రవాణా, ఎగుమతి రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. మిత్రులు, మీ జీవిత భాగస్వామితో కలహాలు తలెత్తుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యం అవసరం.
 
మిథునం :- కుటింబీకులతో కలిసి విందు నోదాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు కొన్ని విషయాలను పట్టించుకోకపోవటం శ్రేయస్కరం. మీ విలువైన వస్తువులు ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి.
 
కర్కాటకం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కేటరింగ్ రంగాల్లో పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రైవేటు సంస్థలోని వారి సమర్థతకు గుర్తింపు లేకపోగా మాటలు పడవలసివస్తుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. 
 
సింహం :- సన్నిహితులు నుంచి ఆకర్షణీయమైన కానుకలు అందుకుంటారు. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ప్రత్యర్థుల తీరును గమనించి తదనుగుణంగా మెలగండి. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్త్రీలకు కళా రంగాలపట్ల, వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య :- కొత్తగా చేపట్టిన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. స్త్రీల తెలివి తేటలకు, వాక్చాతుర్యానికి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది.
 
తుల :- రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. దైవ కార్యక్రమాల పట్ల చురుకుగా పాల్గొంటారు. ఉన్నతస్థాయి అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం.
 
వృశ్చికం :- ఆర్థిక, ఆరోగ్య విషయాలలో సంతృప్తి కానవస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. సన్నిహితులు మిమ్ములను ఉద్రేకపరిచి మీచే ధనం విపరీతంగా వ్యయం చేయిస్తారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
ధనస్సు :- హోటల్, తినుబండారాలు, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కుటింబీకుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు తోటివారి సాయంతో పనులను పూర్తి చేయగలుగుతారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
మకరం :- రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాలలోను ప్రయాణాలలోను మెళుకువ అవసరం. వ్యాపారాభివృద్ధికి చేయు పథకాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. నూతన కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం.
 
కుంభం :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, ప్రేమ విషయాల మీద విరక్తి నెలకొంటాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు.
 
మీనం :- ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు, ఆందోళనలు వంటివి ఎదుర్కుంటారు. బంధువులరాకతో గృహంలో అసౌకర్యానికి గురవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీల మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. కుటింబీకుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటు చేసుకుంటాయి.