గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-02-2022 ఆదివారం రాశిఫలితాలు - ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా శుభం

మేషం :- ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యముగానైనా సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, భాగస్వామిక వ్యాపారాల విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
వృషభం :- మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించిన తమ లక్ష్యం సాధించగలరు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
మిథునం :- దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. ముఖ్యులలో వచ్చిన మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు క్రమంగా తొలగిపోగలవు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.
 
సింహం :- బంధు మిత్రులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. రాజకీయనాయకులు తరచు సభాసమావేశాలలో పాల్గొంటారు. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు.
 
కన్య :- కొత్తగా చేపట్టిన వ్యాపారల్లో నిలదొక్కుకుంటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నూతన పరిచయాలేర్పడతాయి. మీ మనోభావాలకు మంచిస్ఫురణ లభిస్తుంది. మీ సంతానం వివాహ, విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు.
 
తుల :- ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వస్తువుల కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
వృశ్చికం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అసవరం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం.
 
ధనస్సు :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత ముఖ్యం. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం మంచిది కాదని గమనించండి. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అసవరం. స్త్రీలు చేపట్టిన పనుల్లో చికాకులు, అవాంతరాలు ఎదుర్కుంటారు.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్తంగా సాగుతాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. సహోద్యోగులు సహకరించకపోవటంతో నిరుత్సాహం చెందుతారు. వాహనం ఇతరులకు ఇప్పటం మంచిదికాదు. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి సలహా పాటించటం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది.
 
కుంభం :- వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబీకులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్న సదవాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఎవరికీ హామీలు ఉండం మంచిది కాదు. ఓర్పు, చాకచక్యంతో చిక్కు సమస్యలను సరిచేసుకుంటారు.
 
మీనం :- ఆర్ధిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్తవల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రియతముల రాక మీకెంతో సంతృప్తినిస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వూలలో మెళుకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి.