శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-01-2022 శనివారం రాశిఫలితాలు - ఆంజనేయస్వామిని ఆరాధించిన శుభం...

మేషం :- బాకీలు, వాయిదా చెల్లింపుల వసూళ్లలో శ్రమ, ప్రయాస లెదుర్కుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిదికాదు. కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
వృషభం :- కావలసిన వస్తువు లేక పత్రాలు సమయానికి కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. మిత్రుల సహకారంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు విసుకు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. లీజు, ఏజెన్సీలు, టెండర్లకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
మిథునం :- ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. హోటల్, తినుబండరాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. విద్యార్థులకు అధిక శ్రమ వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనం మితంగా వ్యయం చేయటం క్షేమదాయకం.
 
కర్కాటకం :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సోదరీ సోదరులతో ఒక అవగాహనకు వస్తారు.
 
సింహం :- తలట్టిన పనుల్లో జాప్యం, ప్రయాసలు తప్పవు. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని ఆటంకాలెదురవుతాయి. భాగస్వామ్యుల మధ్య వ్యాపార విస్తరణకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళుకువ అసవరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు.
 
కన్య :- ప్రైవేటు ఫైనాన్సు సంస్థలో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. ఉద్యోగస్తులు తోటివారితో వేడుకులు, సమావేశాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహరాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ బలహీనతలను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ది పొందాలని చూస్తారు.
 
తుల :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, స్వీట్ షాపు వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. కొంత మంది మీ నుండి ధనం ఇతరత్రా సహాయం అర్థిస్తారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక రంగంలో వారికి విద్యుత్, కార్మిక సమస్యలు తలెత్తుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధుమిత్రులు వ్యతిరేకిస్తారు.
 
ధనస్సు :- సహోద్యోగులతో అభిప్రాయభేధాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. పీచు, ఫోమ్, లెదర్, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
 
మకరం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలు భేషజాలకు, మొహమ్మాటాలకు పోవటం మంచిది కాదు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు వాయిదా పడతాయి. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాట పడక తప్పదు. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
కుంభం :- ఆర్థిక కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. సహోద్యోగులతో అభిప్రాయభేధాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మీ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు, ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
మీనం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. క్రీడ, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్ లోను, వాహనం నడుపు తున్నప్పుడు ఏకాగ్రత అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు.