శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-04-22 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్య హృదయం పఠిస్తే...

మేషం :- స్త్రీలు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూవస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది.
 
వృషభం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రమాదాలు, వివాదాస్పదాల్లో ఇరుక్కునే ఆస్కారం ఉంది. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
మిథునం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. దైవసేవా కార్యక్రమాల పట్ల, వస్తువుల పట్ల ఆశక్తి అధికమవుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నిరుత్సాహం విడనాడి పట్టుదలతో కృషి చేసిన మీ ధ్యేయం నెరవేరగలదు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
కర్కాటకం :- వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. దంపతుల మధ్య స్వల్ప చికాకులు, అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. వేళతప్పి భోజనం, శారీరకశ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రముఖులను కలుసుకొని సంప్రదింపులు జరుపుతారు.
 
సింహం :- లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం కొంత ముందు వెనుకలగానైనా అందుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో కొత్త వారితో జాగ్రత్త వహించండి. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
కన్య :- స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. సొంతంగా వ్యాపారం చేయాలనే విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం.
 
తుల :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. మిత్రుల ప్రయోజనాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. విందులలో పరిమితి పాటించండి. స్త్రీల మాటకు ఆదరణ, సంఘంలో గౌరవం లభిస్తాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ, అనాలోచితంగా మాట ఇవ్వటం మంచిది కాదు.
 
వృశ్చికం :- ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో అవగాహన ఏర్పడుతుంది. వైద్య రంగాల్లో వారికి వృత్తిరీత్యా చికాకులు ఎదుర్కొన్న మంచి పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. దూరంగా ఉన్న ఆత్మీయులను కలుసుకోవాలనే కోరిక స్ఫురిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి.
 
ధనస్సు :- విద్యుత్ రంగాల వారికి అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. రుణాలు తీర్చి తాకట్టులు విడిపించుకుంటారు. చిన్న చిన్న సమస్యలెదురైనా పరిష్కరించుకుంటారు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.
 
మకరం :- ఏ.సి. కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. సోదరి, సోదరులతో అనుకోని ఇబ్బందులు, చికాకులను ఎదుర్కుంటారు.
 
కుంభం :- స్త్రీలు ఉదరం, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. ఎంతటి క్లిష్ట సమస్యమైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.
 
మీనం :- ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కవి, పండితులకు, కళాకారులకు సంఘంలో ఆదరణ లభిస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రతి వ్యవహారంలోను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.