గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: ఆదివారం, 1 మే 2022 (13:08 IST)

01-05-2022 నుంచి 31-05-2022 వరకూ మీ మాస ఫలితాలు

May 2022 Rashi Phalalu
మేషరాశి: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థిక స్థితి నిరాశాజనకం. ఖర్చులు అదుపులో వుండవు. రుణ సమస్యలు వేధిస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. ఆచితూచి వ్యవహరించాలి. అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతాయి. దంపతుల మధ్య అవగాహనలోపం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. కళ్లు, ఉదరానికి సంబంధించిన రుగ్మతలెదురవుతాయి. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. గృహమార్పు నిదానంగా కనిపిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు స్థానచలనం, ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. అధికారులకు హోదా మార్పు. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి.

 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా వుంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వైద్య, ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.

 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం అన్ని రంగాల వారికి శుభదాయకమే. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. పత్రాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వాహనచోదకులకు అత్యుత్సాహం తగదు.

 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యం నెరవేరుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక వుండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు అదుపులో వుండవు. ధన సమస్యలెదురవుతాయి. పొదుపుధనం ముందుగానే గ్రహిస్తారు. ఆత్మీయల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. దంపతుల మధ్య అవగాహనాలోపం సామరస్యంగా మలగండి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదామార్పు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.

 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. బంధువులతో విభేదాలు వస్తాయి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. సాయం చేసేందుకు అయినవారే వెనకాడుతారు. అవసరాలు అతిష్టం మీద నెరవేరుతాయి. అప్రియమైన వార్తలు వినాల్సి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. తొందరపడి హామీలివ్వవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. గృహమార్పు చికాకుపరుస్తుంది. విలువైన వస్సతువులు మరమ్మతుగు గురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్నవ్యాపారులు, కార్మికులకు కష్టకాలం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.

 
తులారాశి: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారంలో జయం, ధనలాభం వున్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఒక ఆహ్వానం ఉత్సాన్నిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆశించిన పదవులు దక్కవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వేడుకకు హాజరవుతారు. వృత్తివ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ముఖ్యులకు అభినందనలు తెలియజేస్తారు. ప్రేమ వ్యవహారాలు సుఖాంతమవుతాయి.

 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అదుపులో వుండవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. గృహమార్పు సత్ఫలితమిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. ఉపాధి పథకాలలో నిలదొక్కుకుంటారు. వైద్య, సేవ, కార్మిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోవద్దు.

 
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. పురస్కారాలు, కానుకలు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది వుండదు. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.

 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. అవకాశాలను వదులుకోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. దంపతుల మధ్య అవగాహనలోపం. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత లోపిస్తాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ధార్మిక, యోగ విషయాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం అనుకూలదాయకమే. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అందరితో సత్సంబధాలు నెలకొంటాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. సంతానం వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలి. ఆర్థిక వివరాలు గోప్యంగా వుంచండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదా మార్పు, ఆకస్మిక బదిలీ. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది.

 
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆదాయం బాగున్నా వెలితిగా వుంటుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ది. ప్రయాణంలో అవస్థలెదుర్కొంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.