గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 31 మే 2023 (20:34 IST)

01-06-2023 నుంచి 30-06-2023 వరకు ఫలితాలు మీ మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో అవరోధాలు తొలగుతాయి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పదవుల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులు, కార్మికులకు కష్టసమయం. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ మాసం ఆశాజనకం. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ధార్మిక సంస్థలకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. పనులు సానుకూలమవుతాయి. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. గృహమార్పు అనుకూలిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పత్రాలు అందుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం. విత్తన వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. మీ వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఓర్పుతో శ్రమించినగాని పనులు పూర్తి కావు. సన్నిహితుల హితవు మీపై సత్ ప్రభావం చూపుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. చెల్లింపులు వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వేడుకకు హాజరుకాలేరు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో మెళకువ వహించండి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు కలిసిరావు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గతానుభవంతో ఒక సమస్యను అధిగమిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల రాక ధైర్యాన్నిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారాలకు ఆశాజనకం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం గ్రహాల సంచారం అనుకూలం. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవివాహితులు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది. కలిగిస్తుంది. విత్తన వ్యాపారులకు ఆశాజనకం. వ్యవసాయ కార్మికులకు పనులు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. సంతానం దూకుడు అదుపు చేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివవ్వవద్దు. కొంతమంది మీ నుంచి లబ్ధి పొందేందుకు యత్నిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన లోపం. చిన్న విషయమే సమస్యాత్మకమవుతుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వివాహయత్నం ఫలిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. నిశ్చితార్ధాల్లో మెలకువ వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. అధికారులకు స్థానచలనం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. కార్మికులు, చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం అంత అనుకూలం కాదు. ఆచితూచి అడుగువేయండి. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను నమ్మవద్దు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఫోను సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులకు ప్రతి విషయం తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు త్వరలో సత్ఫలితమిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు కష్టకాలం. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం. వైద్య, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. 4. 8, 10, 14, 16, 21, 23, 28, 29 తేదీలు అనుకూలం. 5, 7, 9, 11, 17, 21, 22, 24, 26, 27, 30 తేదీలు ప్రతికూలతలు అధికం.
 
మకర రాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పొదుపునకు ఆస్కారం లేదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. తీర్ధయాత్రలు, దూర ప్రదేశాలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ ప్రోత్సాహకరమే. సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ మాటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆరోగ్యం బాగుంటుంది. ఆశించిన పదవి దక్కకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. వ్యవసాయ కార్మికులకు పనులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం యోగదాయకమే. ధైర్యంగా ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఓఏ