శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: శనివారం, 30 జులై 2016 (21:19 IST)

మీ 10వ సంవత్సరం వరకూ ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు(జి.అభిరామ్)

జి.అభిరామ్: మీరు తదియ, శనివారం, మిధున లగ్నం, ఆరుద్ర నక్షత్రం, మిధున రాశి నందు జన్మించారు. లగ్నము నందు చంద్రుడు ఉన్నందువల్ల మంచి పట్టుదల, మొండి వైఖరి కలిగినవారుగా ఉంటారు. విద్యాకారకుడైన బృహస్పతి తృతీయము నందు ఉన్నందువల్ల మీరు సైన్సు చదువుల్లో ఏకాగ్రత వ

జి.అభిరామ్: మీరు తదియ, శనివారం, మిధున లగ్నం, ఆరుద్ర నక్షత్రం, మిధున రాశి నందు జన్మించారు. లగ్నము నందు చంద్రుడు ఉన్నందువల్ల మంచి పట్టుదల, మొండి వైఖరి కలిగినవారుగా ఉంటారు. విద్యాకారకుడైన బృహస్పతి తృతీయము నందు ఉన్నందువల్ల మీరు సైన్సు చదువుల్లో ఏకాగ్రత వహించిన రాణిస్తారు. మీ 10వ సంవత్సరం వరకూ ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. చదువుల్లో కూడా కొంత వెనుకబడి నెమ్మదిగా పురోభివృద్ధి చెందుతారు. ప్రతిరోజూ దక్షిణామూర్తిని ఆరాధించిన సర్వదోషాలు తొలగిపోతాయి. మీ 24 లేక 25 సంవత్సరము నందు ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడతారు. 27వ సంత్సరము నందు వివాహం కాగలదు.
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.