సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 25 జులై 2020 (19:32 IST)

26-07-2020 నుంచి 01-08-2020 వరకు మీ వార రాశి ఫలితాలు -video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక, 1వ పాదం
ఆదాయ సంతృప్తికరం, ఖర్చులు విపరీతం, బంగారం, వెండి సామగ్రి కొనుగోలు చేస్తారు. బంధుత్వాలు బలపడుతాయి. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. పనులు హడావుడిగా కొనసాగుతాయి. గురు, శుక్ర వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఏ వి షయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. వ్యాపకాలు అధికమవుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు సమస్యలు ఎదురవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక, 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు లోటుండదు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. అపరితులతో జాగ్రత్త. శనివారం నాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు ఉండదు. పెద్దల సలహా పాటిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ పెద్దరికానికి భంగం కలిగే సూచనలున్నాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన ప్రయోజనాలు అందుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు,ఆర్థ్ర, పునర్వసు 1,2, 3 పాదాలు
అవకాశాలు కలిసివస్తాయి. మీ వాక్కు ఫలిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. వస్త్రప్రాప్తి, వస్తు లాభం ఉన్నాయి. పదవులు సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నహితులౌతారు. సాధ్యంకాని హామీలివ్వవద్దు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో దుబారా ఖర్చులు అధికం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. గృహం సందడి ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం, దూకుడును అదుపు చేయండి. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. వ్యాపారాలు ఉపందుకుంటాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో శ్రమించి విజయం సాధిస్తారు. సమస్యలు సద్దుమణుగుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు వేగవంతమవుతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో మెలుకువ వహించండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. మంగళ, బుధ వారాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరకు నిల్వలో జాగ్రత్త, రిటైర్డ్ ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆసావహ దృక్పథంతో మెలగండి. పరిస్థితులు క్రమంగా చక్కబడుతాయి. త్వరలో శుభవార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. గురు, శుక్ర వారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆందోళనలు తగ్గి కుదుటపడుతాయి. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు విస్తరిస్తాయి. సంతానం భవిష్యత్తులపై శ్రద్ద అవసరం. ఆరోగ్యం పట్ల మెలకువ వహించండి. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు పురోభివృధ్ది. ఉపాధ్యాయులకు స్థానచలనం, రిటైర్డు ఉద్యోగస్తులకు ధనయోగం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు. పుణ్య కార్యంలో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర, 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త, 1, 2 పాదాలు
తెలివిగా వ్యవహరిస్తున్నామని తప్పటడుగు వేస్తారు. ఊహలు, అంచనాలు ఫలించవు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనానికి ఇబ్బందిగా ఉంటుంది. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ ఇబ్బందులు సమస్యలు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. సంతాన విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆహ్వానాలు అందుకుంటారు. గృహమార్పు కలసివస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
తుల:  చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను దక్కించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆదాయం సంతృప్తికరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. ఆది, సోమ వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఇతరులకు కలసివస్తుంది. పెద్దరికాన్ని నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వస్త్ర, బంగారం, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
వృశ్చికం: విశాఖ, 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
పరిస్థితులు క్రమంగా మెరుగు పడుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. లక్ష్యాలను రూపొందించుకుంటారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు విపరీతం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. మంగళ, బుధ వారాల్లో పరిచయంలేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఉత్సాహానిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి వకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒడిదిడుకులను దీటుగా ఎదుర్కొంటారు. దైవకార్యాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, 1వ పాదం
ఆదాయం సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. తెలియని వెలితి వెంటాడుతుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కొత్తపనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పరిచయం లేనివారితో జాగ్రత్త. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ద అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. వస్త్ర, ప్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు,శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ఈ వారం ఆశాజనకం, తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సమస్యలు సద్దుమణుగుతాయి. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం ప్రశాంతత పొందుతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. గురు, శుక్ర వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయాలు బలపడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాలల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట, 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. అపరిచితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. దైవ కార్యాలకు వ్యయం చేస్తారు. స్థిరాస్థి దిశగా ఆలోచిస్తారు. సంతానం, చదువులపై శ్రద్ద అవసరం. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఒడిదిడుకులను దీటుగా ఎదుర్కొంటారు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూలతలున్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ధనలాభం ఉంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆది, సోమ వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. కుటుంబీకుల సలహా పాటించండి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానం విషయాల్లో శుభపరిణామాలున్నాయి. చిన్ననాటి పరిచియస్తులను కలుసుకుంటారు. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు స్థానచలనం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నాలు సాగించండి. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం అనుకూలిస్తుంది.