శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (23:31 IST)

04-04-2021 నుంచి 10-04-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అన్ని రంగాల వారికి యోగదాయకమే. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సోదరులతో సంభాషిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. ప్రయాణం వాయిదా పడుతుంది.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
పరిస్థితుల అనుకూలత అంతంతమాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఆది, సోమ వారాలలో పనులు సాగవు. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు.
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ తప్పిదాలన సరిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఎవరినీ నిందించవద్దు. పెద్దల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. మంగళ, బుధ వారాలలో బాధ్యతలు అప్పగించవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి. సంస్థల స్థాపనకు తరుణం కాదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు స్థానచలనం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే వుంటాయి. గురువారం నాడు పనులతో సతమతమవుతారు. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ధనయోగం. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం అన్ని రంగాల వారికి యోగదాయకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆప్తుల ముఖ్య సమాచారం అందిస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సమర్థత మరొకరికి కలిసి వస్తుంది. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి వుంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. బంధుమిత్రుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్యలు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయి. గుట్టుగా వ్యవహరించండి. ఇంటి విషయాలు ఏకరవు పెట్టవద్దు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. వాగ్వాదాలాకు దిగవద్దు. పిల్లల చదువలపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులు ఏకాగ్రత ప్రధానం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు అనుకూలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు సానుకూలమవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుక్ర, శని వారాల్లో ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో మెలకువ వహించండి. వ్యాపకాలు విస్తరిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గృహమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట, 1, 2, 3, 4 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. హామీలు నిలబెట్టుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొండిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యతలోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. వాగ్వాదాలకు దిగవద్దు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. ఉపాధి పథాకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా వుంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కొంతమొత్తం ధనం అందుతుంది. మంగళవారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలతో తీరక వుండదు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. పెద్దల సలహా పాటించండి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. న్యాయ, సేవా, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పిల్లలకు వాహనం ఇవ్వొద్దు. ప్రయాణం కలిసివస్తుంది.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమించి విజయం సాధిస్తారు. కార్యదీక్షకు ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు సామాన్యం. పొదుప పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సంప్రదింపులకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పనులు వేగవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. బుధ, గురువారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. వాయిదా పడిని మొక్కులు తీర్చుకుంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారజయం, ధనప్రాప్తి వున్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. శుక్ర, శని వారాల్లో మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వద్దు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల రాక ఉల్లాసం కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. ఆదివారం నాడు పనులు సాగవు. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. గృహమార్పులు చేపడతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. సెన్సెక్స్ లాభాల బాటలో పయనిస్తుంది. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.