శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (22:21 IST)

16-01-2022 నుంచి 22-01-2022 వరకు మీ వార రాశిఫలాలు (video)

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. శని, అది వారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా మెలగండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. ఎవరినీ నిందించవద్దు. కార్మికులు, బిల్డర్లకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. సమస్యలు నిదానంగా సద్దుమణుగుతాయి. ఖర్చులు సామాన్యం. మంగళవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. నూతన వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. విద్యార్థులకు ఒత్తిడి అధికం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
మీ ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బంధువులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆది, బుధ వారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. విమర్శలు, ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మిమ్ములను వ్యతిరేకించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆదాయం బాగంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సావదానంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. గురు, శుక్ర వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు కొత్త బాధ్యతలు. ముఖ్యులకు వీడ్కోలు, స్వాగతం పలుకుతారు. పందాలు, పశు ప్రదర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
మీ సత్తా చాటుకుంటారు. మీ ఊహలు నిజమవుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సోమ, మంగళ వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు కష్టకాలం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఎంతటి కార్యాన్నైనా తేలికగా పూర్తి చేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గతానుభవంతో ఒక సమస్యను అధిగమిస్తారు. శుక్ర, శని వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ తగదు. వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మధ్యవర్తుల ద్వారా మీ ఇష్టాయిష్టాలను తెలియజేయండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కష్టకాలం. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. యత్నాలకు సన్నాహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళ, బుధ వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆత్మీయుల కలయిక ఉత్సాహానిస్తుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. ఓర్పుతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. 

 
 


వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. పదవుల కోసం యతాలు సాగిస్తారు. గుట్టుగా మెలగండి. వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆత్మీయుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. గృహమార్పు అనివార్యం. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో నిర్ణయానికి వస్తారు. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. చిన్నాచితక వ్యాపారులకు ఆశాజనకం. ఏజెంట్లు, రిప్రజెంటేటిన్లు టార్గెట్లను సాధిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. శుక్ర, శనివారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. గృహ మరమ్మతులు చేపడతారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. అనాలోచితంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఈ వారం ప్రతికూలతలు అధికం. అవకాశాలు కలిసిరాక నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో మెలగండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సలహాలు, సహాయం ఆశించవద్దు. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరానికి ధనం అందుతుంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్ట సమయం. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. కీలక పత్రాలు అందుకుంటారు. వాహనం పిల్లలకివ్వవద్దు. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. పట్టుదలతో శ్రమించిన గాని అనుకున్నది సాధించలేరు. స్వయంకృషితోనే రాణిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీవారు లేక శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. గృహమార్పు కలిసివస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. యోగాపై ఆసక్తి పెంపొందుతుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బంధువు రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గురు, శుక్ర వారాల్లో దంపతుల మధ్య అకాల కలహం. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు జ్ఞప్తికొస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలిసివస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చిరు వ్యాపారులకు కష్టసమయం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.