బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2024 (19:45 IST)

20-10-2024 నుంచి 26-10-2024 వరకు మీ వార ఫలితాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆశయం నెరవేరుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. సోమవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రముఖుల కలయిక కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వూహాత్మకంగా అడుగులేస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, అధికారులకు స్థానచలనం. అధికారులకు స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అంచనాలు నిరుత్సాహ పరుస్తాయి. మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆర్థికంగా బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. ఈ చికాకులు తాత్కాలికమే. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. సన్నిహితుల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. సాంకేతిక రంగాల వారికి నిరాశాజనకం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలుంటాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తను అర్థం చేసుకుంటారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వాగ్వాదాలకు దిగవద్దు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత్త వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకూల ఫలితాలున్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. మనోధైర్యంతో యత్నాలు ప్రారంభిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలున్నాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. గురువారం నాడు అనవసర విషయాల జోలికి పోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం అనుకూలదాయకం. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతను తెలుసుకోండి. తొందరపడి హామీలు ఇవ్వొద్దు. పెద్దల సలహా పాటించండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారిని సంప్రదిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ సామార్థ్యంపై నమ్మకం పెంచుకోండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. శుక్ర, శనివారాల్లో కీలకపత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిసారిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులతో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. వ్యాపారాలు క్రమంగా పుంజుకుటాయి, నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. వ్యవహారాల్లో లాభసాటి నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపు దనం అందుతుంది. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆత్మీయుల సలహా పాటిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. సంతానానికి శుభయోగం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక విషయాల్లో సమయస్ఫూర్తిగా మెలగాలి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకం. పెట్టుబడులు కలిసివస్తాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించాలి. అవివాహతులకు శుభయోగం. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. సన్నిహితులతో సంభాషిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీదైన రంగంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. చేపట్టిన పనులు అర్థాంతగా ముగించవలసి వస్తుంది. కొందరి వ్యాఖ్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. మంగళవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సన్నిహితులు చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. విదేశాల సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద విషయాల్లో జోక్యం తగదు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అందరితోనూ మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుగా భావిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా తీసుకోండి. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల అభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. ప్రణాళికలు వేసుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ప్రియతముల వ్యాఖ్యలు కార్మోన్యుఖులను చేస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కీలక వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పనిభారం. ఉన్నతాధికారులకు బాధ్యతల మార్పు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణం తలపెడతారు.