గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (19:56 IST)

08-10-2023 నుంచి 14.10.2023 వరకు మీ వార రాశిఫలాలు

weekly horoscope
మేష : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. యత్నాలు కొనసాగించండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు కలిసిరావు. నోటీసులు అందుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సోమ, మంగళవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు గోప్పంగా ఉంచండి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. గురువారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. తప్పుడు ప్రచానాలను పట్టించుకోవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ప్రశంసలు, పురస్కారయోగం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
గ్రహాల సంచారం బాగుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదవీయోగం. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష, 1, 2, 3, 4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. ఆదివారం నాడు అపరిచితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. పెద్దల సలహా పాటించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పనిభారం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. బాధ్యతగా వ్యవహరిస్తారు. మీ గౌరవం పెంపొందుతుంది. ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. బుధ, గురువారాల్లో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. యోగ, ధార్మికతలపై ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
గ్రహాలస్థితి అనుకూలంగా ఉంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పెట్టుబడులు కలిసివస్తాయి. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శుక్రవారం నాడు పత్రాలు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు పనులు ఒక పట్టాన పూర్తి కావు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఉత్సాహంగా యత్నాలు కొనసాగిస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు. ప్రముఖులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెట్టుబడులు కలిసిరావు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆది, సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ సహకారంతో ఒకరికి మంచి జరుగుతుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనివార్యం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
శుభవార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు నిదానంగా సత్ఫలితాలిస్తాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఈ వారం యోగదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బాధ్యతగా మెలగాలి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్ధంలో మెళకువ వహించండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు చేపడతారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
అనుకూలతలు నెలకొంటాయి. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులకు కలిసిరావు. పనులు వేగవవంతమవుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మంగళ, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం. రిప్రజెంటేటివ్‌లు లక్ష్యాలను పూర్తి చేస్తారు. దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
కార్యసాధనకు కృషి, పట్టుదల ప్రధానం. సలహాలు, సహాయం ఆశించవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆత్మీయుల హితవు మీపై బాగా పనిచేస్తుంది. ఆది, గురువారాల్లో పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం సర్దుబాటవుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు ఉల్లాసాన్నిస్తాయి. దంపతుల మధ్య అరమరికలు తగవు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. మానసికంగా కుదుటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు కొత్త బాధ్యతలు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం చికాకుపరుస్తుంది.