శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (20:04 IST)

01-03-2020 నుంచి 07-03-2020 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం    
ఆర్థిక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ఖర్చులు అదుపులో వుండవు. ఆహ్వానం అందుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖులను కలుసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం ఉంది. శనివారం నాడు ఖర్చులు అదుపులో వుండవు. అవసరాలు నెరవేరుతాయి. పనులతో సతమతమవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. గృహమార్పు అనివార్యం. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు   
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య అరమరికలు తగవు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అనుకూలతలు అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం. వుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దుబారా ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. రాబడిపై దృష్టి పెడతారు. ఆది, సోమ వారాల్లో పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు ఓర్పు, అంకితభావం ప్రధానం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష   
మనోధైర్యంతో వ్యవహించండి. ఖర్చులు విపరీతం. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. మాట నిలబెట్టుకుంటారు. గౌరవాభిమానాలు పెంపొందుతాయి. మంగళ, బుధవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. కీలక పత్రాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం   
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. మనోధైర్యంతో ముందుకు సాగండి. పంతాలు, భేషజాలకు పోవద్దు. లౌక్యంగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా ఉంటుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. గురు, శుక్రవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. పెట్టుబడులు కలిసిరావు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన లోపం. ఓర్పుతో మెలగాలి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ధనలాభం, పదోన్నతి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత ప్రధానం.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది వుండదు. పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు    
వ్యవహారాల్లో మెలకువ వహించండి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంతాన కదలికసలపై దృష్టి పెట్టండి. ప్రియతములను కలుసుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. పెట్టుబడులకు తరుణం కాదు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ   
శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. మీ మాటకు ఎదురుండదు. పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. అవకాశాలను వదులుకోవద్దు. స్వయంకృషితో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఒక  అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. ప్రయాణం కలిసివస్తుంది. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం   
ఈ వారం  సంప్రదింపులకు అనుకూలం. అవకాశాలు కలిసివస్తాయి. మీ కష్టం వృధా కాదు. ధనలాభం, వాహనయోగం వున్నాయి. ఖర్చులు భారమనిపించవు. రుణ సమస్యలు కొలికివస్తాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం వుంది. పనుల సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వ్యాపార లావాదేవీలతో తీరిక ఉండదు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మకరం: ఉత్తారాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు   
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలెదురవుతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. వ్యవహారానుకూలత ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. పెరిగిన ధరలు, ఊహించని ఖర్చులు, రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. బుధవారం నాడు అపరిచితులతో జాగ్రత్త. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. పట్టుదలతో వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరగా సాగుతాయి. శుభకార్యంలో పాల్గొంటారు. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అప్రమత్తంగా వ్యవహరించాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. తప్పటడుగు  వేసే ఆస్కారం. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గురు, శుక్రవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అవగాహనం సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. విద్యార్థుల్లో ఏకాగ్రత నెలకొంటుంది.