గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (19:01 IST)

27-08-2023 నుంచి 02-09-2023 వరకు మీ వార రాశి ఫలితాలు

Pisces
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
కీలక అంశాలపై దృష్టిపెడతారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆదివారం నాడు కొత్త సమస్యలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. గృహమార్పు యత్నాలు సాగిస్తారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. యాజమాన్యం వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఏ ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి నిరాశాజనకం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. మంగళవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ జోక్యం అనివార్యం. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత వహించండి. సాధ్యం కాని హామీలివవ్వద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మార్కెటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మిధునం :మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. బుధ, గురు వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త బంధుత్వాలు బలపడతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఒత్తిడి అధికం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
వ్యవహారదక్షతతో రాణిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. కష్టమనుకున్న పనులు సానుకూలమవుతాయి. శుక్రవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పత్రాలు సవరణలో మార్పులు అనుకూలించవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులు కలిసివస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహం ఇస్తుంది. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
సింహము 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక సాధ్యం కాదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణసమస్యలు వేధిస్తాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆటంకాలెదురవుతాయి. పెట్టుబడులు కలిసిరావు. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం వాయిదా పడుతుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త1,2 పాదములు
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచింపవద్దు. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటువుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. ఇబ్బందులు తొలగి కుదుటపడతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. పారిశ్రామిక రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు ఉండదు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఈ వారం అనుకూలతలు అంతంత మాత్రమే. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు విపరీతం. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గృహమార్పు అనివార్యం. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆప్తుల గురించి ఆందోళన చెందుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. సంస్థల స్థాపన అనుకూలించదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలసిరావు. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బుధవారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఉపాధ్యాయుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. మనోధైర్యంతో మెలగండి. సమర్థతను తక్కువ అంచనా వేసుకోవద్దు. త్వరలో అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మీ శ్రీమతి వైఖరి అసమనం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. గురువారం నాడు గుట్టుగా యత్నాలు సాగించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. పెట్టుబడులకు తరుణం కాదు. అధికారులకు హోదా మార్పు, పనిభారం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి అధికం.
 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి. అపజయాలకు కుంగిపోవద్దు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శనివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి మాటతీరు అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. షాపుల స్థల మార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ధనప్రలోభాలకు లొంగవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త, దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
శ్రమించినా ఫలితం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. అవసరాలకు ధనం సర్దుబాటువుతుంది. సోమవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య అవగాహన లోపం. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు ఉల్లాసాన్నిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు.