శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (22:53 IST)

04-12-2022 నుంచి 10-12-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మనోధైర్యంతో శ్రమిస్తే విజయం తథ్యం. మీ నమ్మకం వమ్ముకాదు. ప్రణాళికలు వేసుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మంగళ, బుధ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు యూనియన్ గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. గృహమార్పు అనివార్యం. గురు, శుక్ర వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ ప్రణాళికలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు చేసిన పనులో తిరిగి చేయవలసి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాగ్ధాటితో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. సోమ, మంగళ వారాల్లో పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆశావహదృక్పథంతో అడుగుముందుకేయండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఆది, బుధ వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్థల వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
మీదైన రంగాల నిలదొక్కుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తారు. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. శుక్ర, శని వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహమార్పు అనివార్యం. ఆహ్వానం అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. సరుకు నిల్వలో జాగ్రత్త. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
అన్ని రంగాల వారికీ యోగదాయకం. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితులు సహాయం అందిస్తారు. ఆర్ధికంగా బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతగా మెలగాలి. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆధ్మాత్మిత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృశ్చికం : 
 
విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులకు మరింత చేరువవుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆదాయానికి లోటుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. గురువారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. అజ్ఞాతవ్యక్తులతో జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన వ్యాపారాలకు అనుకూలం. వస్త్ర, ఫ్మాన్పీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఆర్థికస్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆశావహదృక్పధంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆప్తులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. 

కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఈ వారం అనుకూలదాయకం. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంతానం ధోరణి చికాకుపరుస్తుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. ఆహ్వానం అందుకుంటారు. ఆది, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ప్రియతమల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.