గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 20 జులై 2024 (20:12 IST)

21-07-2024 నుంచి 27-07-2024 వరకు మీ వార రాశి ఫలితాలు-కన్యారాశికి అంతా శుభమే

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సాయం ఆశించవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. ఖర్చులు సామాన్యం. ధనసహాయం తగదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానానికి శుభం జరుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. కీలక అంశాలపై దృష్టి పెడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. నోటీసులు అందుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దూర ప్రదేశాలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ వృధా కాదు. కొంతమొత్తం ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి ప్రోద్బలంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహనిర్మాణాలు ముగింపు దశకు చేరుకుంటాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. దంపతుల మధ్య చీటికిమాటికి తగవులు. గురువారం నాడు చేసిన పనులు మొదటికే వస్తాయి. ఆశవహదృక్పథంతో యత్నాలు సాగించండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొనుగోలుదార్లతో సౌమ్యంగా మెలగండి. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు ఓర్పుతో శ్రమించాలి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలను అందిపుచ్చుకోండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలు తెలుసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
విశేషమైన కార్యసిద్ధి ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. గృహామార్పు కలిసివస్తుంది. అవివాహితులకు శుభయోగం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పాత పరిచయస్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఆరోగ్యం బాగుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురు, శుక్ర వారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది, ధనం మితంగా వ్యయం చేయండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం విద్యాయత్నాలు ఫలిస్తాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిరుద్యోగులకు శుభయోగం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. అసాంఘిక కార్యకలపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు నిరాశపరుస్తాయి. వ్యవహారాల్లో తప్పటడుగువేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. గుట్టుగా మెలగండి. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. ఆత్మీయుల ప్రోద్బలంతో కొత్తయత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు చెల్లించుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. యత్నాలు విరమించుకోవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అనివార్యం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఉద్యోగులకు కష్టసమయం. సహోద్యోగులతో జాగ్రత్త. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. మీ చొరవతో ఒకరికి మంచి జరుతుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహాలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. కీలకపత్రాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతి విషయంలోను మొండిగా వ్యవహరిస్తారు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అయిన వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. గురువారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులు కలిసిరావు. ఉపాధ్యాయులకు పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.