సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (13:32 IST)

22-12-2019 నుంచి 28-12-2019 ఈ వార ఫలితాలు- video

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
వ్యవహారానుకూలత ఉంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. గత సంఘటనలు పునరావృతమవుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలసివస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు సామాన్యం. పనుల్లో శ్రమ అధికం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. గృహమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారుల తీరును గమనించి మెలగండి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. మీ అశక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యవహారాలు అనుకూలించవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. అనవసర జోక్యం తగదు. గురు, ఆదివారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి ఆప్తులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలకు కచ్చితంగా తెలియజేయండి. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం సంతృప్తికరం. సంప్రదింపలు సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు ఉండదు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగదు. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. ఆప్తుల సలహా పాటించండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అదుపులో వుండవు. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. సాయం అడిగేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రియతములను కలుసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆశావహ దృక్పథంలో ఉద్యోగయత్నం సాగించండి. ప్రకటనలను విశ్వసించవద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిలిచిపోయిన పనులు పునః ప్రారంభిస్తారు. ఆర్థిక లావాదేవీలతో తీరికి ఉండదు. సమస్యలకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు విపరీతం. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. భవిష్యత్ అవసరాలపై దృష్టి పెడతారు. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పెద్దమొత్తం సాయం తగదు. ఆది, సోమవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య సమాచారం సేకరిస్తారు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. మంగళ, బుధవారాల్లో విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. జూదాల జోలికి పోవద్దు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణ ఒత్తిళ్లు అధికం. పనులతో సతమతమవుతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఒక విషయం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. గురు, శుక్రవారాల్లో దంపతుల మధ్య అవగాహన లోపం. వాగ్వాదాలకు పోవద్దు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. అధికారులకు హోదా మార్పు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. న్యాయ, సేవా రంగాల వారికి సామాన్యం. ప్రయాణం తలపెడతారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
మనోధైర్యంతో ముందుకు సాగండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఏకాగ్రత, అంకితభావం ప్రధానం. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. శనివారం స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం వుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
 
మకరం: ఉత్తారాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. పరిచయం లేనివారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం సందడిగా ఉంటుంది. బుధవారం నాడు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. దళారులు, ఏజెన్సీలు సంస్థలను విశ్వసించవద్దు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల అలంకరణ కలిసివస్తుంది. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. పోటీల్లో విజయం సాధిస్తారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
వ్యవహారానుకూలత వుంది. సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గురు, శుక్రవారాల్లో వాగ్వాదాలకు దిగవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పత్రాల రెన్యువల్‌‌లో అలక్ష్యం తగదు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వాహన చోదకులకు దూకుడు తగదు.