సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (16:24 IST)

15-12-2019 నుంచి 21-12-2019 వరకు మీ రాశి ఫలితాలు (video)

మేషం:  అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
వ్యవహార, లావాదేవీలతో తీరిక వుండదు. పెద్దల సలహా పాటించండి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం వుంది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. శుభకార్యంలో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బుధవారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. అపరిచితులను నమ్మవద్దు. ఆర్యోగం సంతృప్తికరం. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.  
ఖర్చులు అదుపులో వుండవు. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. పట్టుదలతో వ్యవహరించండి. ఇతరులను సహాయం ఆశించవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. గురు, శుక్రవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. గృహం ప్రశాంతకు భంగం వాటిల్లే సూచనలున్నాయి. సౌమ్యంగా మెలగండి. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. 
 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.   
శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి సాధ్యం కాని హామీలివ్వవద్దు. గృహ మార్పు కలిసివస్తుంది. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రుణ ఇబ్బందులు తొలగిపోతాయి. పనులు సాగక విసుగు చెందుతారు. శని, ఆదివారాల్లో ప్రముఖుల ఇంటర్వూ వీలుపడదు. వ్యాపారాభిృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం. సమావేశాల్లో పాల్గొంటారు. క్రీడాపోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష 
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహ మార్పు చికాకుపరుస్తుంది. కొత్త సమస్యలెదురవుతాయి. అప్రమత్తంగా వుండాలి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ ఒత్తిళ్లు అధికం. పొదుపు ధనం గ్రహిస్తారు. ఆహ్వానం అందుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు ఆశించినంతగా సాగవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుత్సాహం వీడి ముందుకు సాగించండి. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఈ వారం ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయం అనివార్యం. పనులు హడావుడిగా సాగుతాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మీ మాటకు తిరుగుండదు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.  
పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. సోమ, మంగళ వారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి.  సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. అధికారులకు హోదా మార్పు, ఆకస్మిత స్థానచలనం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. సంస్థల స్థాపనలకు అనుకూలం. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. ప్రయాణం చికాకు పరుస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. బుధ, గురువారాల్లో పనులు సాగవు. మీ పై శకునాల ప్రభావం అధికం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం అనూరాధ, జ్యేష్ట 
పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాల కోసం ఎదురుచూడవద్దు. లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో వుండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. శని, ఆదివారాల్లో చీటికి మాటికి అసహనం చెందుతారు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు శుభయోగం నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. క్రీడాకారులకు  ప్రోత్సాహకరం. వాహన చోదకులకు దూకుడు తగదు. ప్రయాణంలో జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.  
ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ధనలాభం, వాహనయోగం వున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. సోమ, మంగళ వారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.  
ఆత్మీయులను కలుసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం. ఆలోచనలు నిలకడగా వుండవు. మాటతీరు అదుపులో వుంచుకోవాలి. చిన్న విషయమే సమస్యాత్మకమవుతుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. పనులు మందకొడిగా సాగుతాయి. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. పత్రాలు సమయానికి కనిపించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు మునుముందు మంచి ఫలితాలినిస్తాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.  
 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు.  
ఈ వారం యోగదాయకం. శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆకస్మికంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది వుండదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.  మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వేడుకలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు ఉత్సాహాన్నిస్తుంది. గురు, శుక్రవారాల్లో వస్తువులు, పత్రాలు జాగ్రత్త. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. పెట్టుబడులకు అనుకూలం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వృత్తుల వారికి సామాన్యం. ఈగీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. శని, ఆదివారాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వ్యవహారానుకూలత ఉంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లు ధీటుగా ఎదుర్కొంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వివాదాలు, రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి.