సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (21:45 IST)

08-12-2019 నుంచి 14-12-2019 మీ వార రాశిఫలాలు-Video

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.  
ఈ వారం ఒత్తిడి, శ్రమ అధికం. వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. యత్నాలు విరమించుకోవద్దు. పనులు ముందుకు సాగవు. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు మిత్రులే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆధిక్యత ప్రదర్శించవద్దు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. నోటీసులు అందుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వివాదాలు జటిలమవుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.  
ఆర్థికస్థితి సామాన్యం. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. సహాయం ఆశించవద్దు. సోమ, మంగళవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. అవకాశాలు కలిసిరావు. ప్రతి చిన్న విషయం ఆందోళన కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. మీ ఆత్మభిమానం కాపాడుకోవడం ప్రధానం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అలవాట్లను మార్చుకుంటారు. వ్యవహార బృందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల మాటను శిరసా వహిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులకు కొత్త సమస్య లెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వేడుకలకు హాజరవుతారు. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.  
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కృషి ఫలించకున్నా యత్నించామనే తృప్తి వుంటుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. సోమ, మంగళవారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. గృహమార్పు అనివార్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. ఉద్యోగుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష 
గృహమార్పు కలిసివస్తుంది. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంప్రదింపులకు అనుకూలం. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. బుధ, గురువారాల్లో శ్రమ అధికం. ఫలితం శూన్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. సన్నిహితుల హితవు మంచి ప్రభావం చూపుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు ముగింపు దశలో అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన లోపం. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వదు. ధనలాభం వుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.  
అన్ని రంగాల వారికి యోగదాయకమే. వ్యవహారానుకూలత, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది వుండదు. నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆది, సోమ వారాల్లో అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం సాయం తగదు. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మంగళ, బుధవారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు సకాలంలో పనులు పూర్తి కాగలవు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థుల వైఖరి గమనించండ. తొందరపాటుతనం తగదు. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధువులను సంతోషపరుస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ప్రయాణంలో జాగ్రత్త
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం అనూరాధ, జ్యేష్ట 
వ్యవహారాల్లో మెలకువ వహించండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. అనుకూలతలు అంతంత మాత్రమే. ఆర్థికంగ ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఓర్పుతో శ్రమించినా గానీ పనులు కావు. గురు, శుక్రవారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. సన్నిహితుల సలహా పాటించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారుల పట్ల అప్రమత్తంగా వుండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సేవా, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.  
పరిచయాలు, బంధుత్వాలు పెంపొందుతాయి. అనుకున్నది సాధిస్తారు. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలున్నాయి. ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. శని, ఆదివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.  
శుభవార్త వింటారు. మనస్సు తేలికపడుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఆహ్వానం అందుకుంటారు. కొత్త సమస్యలెదురవుతాయి. అప్రమత్తంగా వుండాలి. సంప్రదింపులు సాగవు. తప్పటడుగు వేస్తారు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. మంగళ, బుధవారాల్లో ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. రసీదులు, పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు. బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు.  
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. ఎదుటివారి తీరును గమనించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ధనలాభం వుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. గురు, ఆదివారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. కష్టం ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. నగదు, పత్రాలు జాగ్రత్త. బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగాలి. ఆధిక్యత ప్రదర్శించవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.