గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (22:21 IST)

03-10-2021 నుంచి 09-10-2021 వరకు మీ వార రాశిఫలాలు

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఈ వారం ప్రతికూలతలు అధికం. ఎంతగా శ్రమించినా ఫలితం శూన్యం. ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ అశక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచింపవద్దు. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారల వైఖరి అసహనం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి సలహాలు, సహాయం ఆశించవద్దు. సన్నిహితుల హితవు మీపై సత్‌ప్రభావం చూపుతుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. మీ సమర్ధత వేరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏది జరిగినా మంచికేనని భావించండి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా కుదుటపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. అధికారులకు హోదా మార్పు, ఆకస్మిక స్థానచలనం. దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులకు అనుకూలం. బంధుత్వాలు బలపడతాయి. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు శుభదాయకం. పురస్కారాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి, సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
వహారాలు అనుకూలిస్తాయి. వాగాటితో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బుధవారం నాడు నగదు స్వీకరణ, చెల్లింపుల్లో మెలకువ వహించండి. పనులు చురుకుగా సాగుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల ధోరణి చికాకుపరుస్తుంది. ఎవరినీ నొప్పించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆత్యీయుల రాకపోకలు అధికమవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. కొంతమంది మీ యత్నాలకు అడ్డు తగులుతారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మంగళ, గురు వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త హోల్‌సేల్ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఓర్పుతో వ్యవహరించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. శుక్ర, శని వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఎవరినీ నిందించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి పనిభారం మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ఓర్పుతో వ్యవహరించాలి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. చిన్న విషయమే వివాదాస్పదమవుతుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆది, సోమ వారాల్లో పనులు సాగవు. వీటికిమాటికి అసహనం చెందుతారు. సన్నిహితుల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాల్లో ఒడిదుడుకులెదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. అంచనాలు ఫలించవు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మంగళ, బుధ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. బంధువులరాక ఇబ్బంది కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తంచేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఏజెంట్లు, రిప్రజెంటేటిలకు ఒత్తిడి, శ్రమ అధికం. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రియతముల రాక ఉల్లాసం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ ఇష్టాయిష్టాలను ఆప్తుల ద్వారా తెలియజేయండి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలకు అనుకూలం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. సెన్సెక్స్ లాభాల బాటలో సాగుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
వ్యవహారానుకూలత ఉంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. అది, శని వారాల్లో పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో పురోగతి అనుభవం గడిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
సంప్రదింపులకు అనుకూలం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఓర్పుతో వ్యవహరించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మాటతీరు మార్చుకోవటం ఉత్తమం. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు ధనం అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సోమ, బుధ వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. గురువారం నాడు అనవసర జోక్యం తగదు. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. అపరిచితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి.