సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (22:35 IST)

25-09-2022 నుంచి 01-10-2022 వరకు మీ వార రాశిఫలాలు (video)

Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళ, బుధవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలం అవుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ధనమూలక సమస్యలెదురవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఆది, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసర జోక్యం తగదు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
గ్రహసంచారం బాగుంది. మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కష్టమైన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సోమ, మంగళవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. దైవదర్శనాల్లో ఇబ్బందులెదురవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆప్తులను వేడుకలకు ఆహ్వానిస్తారు. బుధ, గురువారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెంట్లు, సంస్థలను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. కీడా, కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. మానసికంగా కుదుటపడతారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. శుక్ర, శనివారాల్లో ప్రకటనలను నమ్మవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. అనవసర జోక్యం తగదు. గృహ మరమ్మతులు చేపడతారు. పత్రాలు, ఆపర్వసం అందుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కార్మికులకు పనులు లభిస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆదివారం నాడు పనులు సాగవు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సన్నిహితులను వేడుకలకు ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. సాంకేతిక రంగాల వారికి సామాన్యం. వాహనదారులకు దూకుడు తగదు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. త్వరలో సంతోషకరమైన వార్తలు వింటారు. ఆది, సోమవారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్పలితమిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. షాపుల సలమార్పు అనివార్యం. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనంతో మెలగండి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. సహాయం అర్ధించేందుకు మనస్కరించదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. గురువారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సన్నిహితుల రాకతో కుదుటపడతారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. వ్యాపారాలు
ప్రోతోహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. అసాంఘిక కార్యక్రమాల జోలికిపోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 123 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. బుధ, శుక్రవారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యులు ఉత్తేజపరుస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆది, శనివారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
ఆర్థికస్థితి సామాన్యం. ఖర్చులు అదుపులో ఉండవు. ఇంటి సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆశావహదృక్పథంతో
మెలగండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులరాకతో కుదుటపడతారు. సోమ, మంగళవారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. పట్టుదలతో వ్యవహరించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. సేవ, ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ప్రత్యర్థుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. బుధ, గురువారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్థిరచరాస్తుల వ్యవహారాల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు.