శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే వాము

గురువారం, 21 డిశెంబరు 2017 (14:11 IST)

శీతాకాలంలో వాము వేసి మరిగించిన నీటిని సేవించడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా వుంటుంది. ఈ నీటిని సేవించడం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. వాముతో మరిగించి నీళ్లని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. వాముని తేనెతో కలిపి వరుసగా పది రోజులు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగే కరిగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
వాములో అధికంగా ఉండే థైమల్‌ అనే రసాయనం బ్యాక్టీరియా, ఫంగల్‌ వ్యాధుల్ని నిరోధిస్తుంది. యాంటీ సెప్టిక్‌గానూ పని చేస్తుంది. అంతేగాకుండా వాములో వుండే పీచు, యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్లు.. తలనొప్పి, జలుబు, అలసటను దూరం చేస్తుంది. వాము నుంచి తీసిన నూనె కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. 
 
ఒక చెంచా వామును గ్లాసు నీళ్లల్లో మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు, జలుబు సమస్యలు తగ్గుముఖం పడతాయి. వాము కడుపునొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా వాము కలిపి తాగితే అజీర్తి తగ్గి, ఆకలి పెరుగుతుందని.. అల్సర్ దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మీరు రాత్రి సమయంలో పుట్టారా.. అయితే ఖచ్చితంగా ఇది చదవాల్సిందే..

ప్రపంచంలో పుట్టిన మనుషులందరిలోను బాగా తెలివైన వారు కొందరు ఉంటారు. అలాగే కొంచెం తెలివైన ...

news

పైనాపిల్ జ్యూస్‌తో ప్రయోజనాలు...

మంచి భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పండ్లు... ఇలా సక్రమంగా అన్నీ తీసుకుంటుంటే ఆరోగ్యంగా ...

news

భార్యను భర్త అలా చూస్తే ఆ పరిణామాల తీవ్రత ఎలా ఉంటుందో తెలుసా...

భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన శృంగారం ఎంతో ముఖ్యం. ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ రాత్రి ...

news

రోజుకో స్పూన్ నెయ్యి మంచిదే..

రోజుకో స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెయ్యి ...