శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : శనివారం, 21 జులై 2018 (17:03 IST)

ఉలవలను కషాయంగా తీసుకుంటే?

ఉలవలు మన దేశంలో తెలియని వారుండరు. ఒక్కో ప్రాంతంలో వీటిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇక ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. ఈ క్రమంలోనే ఉలవలను తరచుగా తీసుకుంటే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి పోషకాలు అందించడంలో చాలా

ఉలవలు మన దేశంలో తెలియని వారుండరు. ఒక్కో ప్రాంతంలో వీటిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇక ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. ఈ క్రమంలోనే ఉలవలను తరచుగా తీసుకుంటే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి పోషకాలు అందించడంలో చాలా ఉపయోగపడుతాయి.
 
ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే స్త్రీలకు రుతు సమయంలో కలిగే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎక్కిళ్లు తగ్గుతాయి. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. ఉలవల్లో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండడం వలన ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతాయి.
 
ఉలవల్లో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటును నియంత్రించుటలో సహాయపడుతాయి. ఉలవలను రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. 
 
ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే క్రమంగా సన్నబడుతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకుని జావమాదిరిగా తయారుచేసుకోవాలి. ఉలవలను పిడికెడు తీసుకుని పెనంమీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. 
 
దీంతో నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. పావు కప్పు ఉలవలను చిటికెడు పొంగించిన ఇంగువను, పావు సూన్ అల్లం ముద్దను, పావు స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినన్ని నీటిలో కలుపుకుని ఇందులో కొద్దిగా తేనెను కలుపుకుని నెలరోజులపాటు తీసుకుంటే అల్సర్ వ్యాధి నుండి విముక్తి చెందవచ్చును.