Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెల్లుల్లి రెబ్బలను ఉడికించిన పాలను తీసుకుంటే?

మంగళవారం, 4 జులై 2017 (11:47 IST)

Widgets Magazine

వెల్లుల్లి రెబ్బలను పాలలో వేసి ఉడికించి తీసుకోవడం ద్వారా జలుబు, జ్వరం నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ఓ పాత్రలో పాలను పోసి అందులో వెల్లుల్లి రెబ్బలను దంచి వేయాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఉడికిన తర్వాత.. పంచదార, మిరియాలపొడి, పసుపుపొడి చిటికెడు చేర్చి కాసేపు ఉడికించాలి. ఆపై స్టౌ మీద నుంచి ఆ పాలను దించి.. పాలలోని వెల్లుల్లి రెబ్బలను కవ్వంతో మెత్తగా చేసుకోవాలి. అంతే వెల్లుల్లి పాలు రెడీ అయినట్లే. దీన్ని రాత్రిపూట గ్లాసుడు తాగడం ద్వారా మొటిమలు దూరమవుతాయి. 
 
ఈ పాలును రోజు రాత్రిపూట నిద్రించేందుకు ముందు తీసుకుంటే.. మోకాలి నొప్పి, నడుము నొప్పి మటుమాయం అవుతాయి. వెల్లుల్లి రెబ్బలు ఉడికించిన పాలను సేవించడం ద్వారా ఒబిసిటీనీ దూరం చేసుకోవచ్చు. గుండెను పదిలం చేసుకోవచ్చు. రక్తంలో చేరే చెడు కొలెస్ట్రాల్‌ను ఇది దూరం చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మహిళల్లో నెలసరి సమస్యలను నయం చేస్తుంది. 
 
మలేరియా, టీబీ వంటి రోగాలను దరిచేరనివ్వదు. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియాతో పోరాడుతుంది. శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి ఉడికించిన పాలను ఉదయం పరగడుపున తాగడం ద్వారా ఉదరంలోని క్రిములను నశింపజేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రెండు యాలకులను బుక్కన వేసుకుని నమిలితే...

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని వంటింట్లో యాలకులు ఉంటాయి. వీటిని మసాలా కూరల్లో, స్వీటు ...

news

అభ్యంగన స్నానం చేసిన వెంటనే భోజనం చేయొచ్చా?

శరీరంలోని మాలిన్యాలు చర్మపు సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ ...

news

సముద్ర ఆహారంతో గుండెపోటును అడ్డుకోవచ్చు....

గుండె ఆరోగ్యంగా వుండాలంటే సముద్రపు ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ ఆహారం ...

news

వర్షాకాలంలో వేడినీళ్లు ఎందుకు తాగాలి?

వర్షాకాలం అనగానే జబ్బులు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం ...

Widgets Magazine