మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 14 జులై 2022 (17:11 IST)

విష్ణుక్రాంతి మొక్క కనబడితే తెచ్చి పెట్టేసుకోండి...

Vishnukranti
ప్రకృతి మనకు ఎన్నో ఔషధ మొక్కలను అందించింది. వాటిలో కొన్ని మొక్కలు గురించి మాత్రమే తెలుసు. చాలా మొక్కల ఔషధ విలువలు తెలియవు. విష్ణుక్రాంతి మొక్క పేరును ఎప్పుడైనా విన్నారా. ఇది పొలాల్లోనో అటవీ ప్రాంతాల్లోనో కనబడుతుంది.


ఈ మొక్కలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. విష్ణుక్రాంతి మొక్కను ఎండబెట్టి పొడి చేసి తేనె లేదా వేడి నీటిలో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, జ్వరం మొదలైనవి నయమవుతాయి.

 
ఒక చెంచా విష్ణుక్రాంతి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి వేడి నీళ్లలో కలిపి తాగితే దగ్గు, అజీర్ణం తగ్గుతాయి. వీటి ఆకులను గోరింటాకులా మెత్తగా నూరి తింటే కడుపులో నులిపురుగులు పోతాయి. విరేచనాలు తగ్గేందుకు విష్ణుక్రాంతి వేర్లు, ఆకులు, కాండం, పువ్వులు మెత్తగా చేసి పెరుగులో ఇవ్వాలి. డెంగ్యూ జ్వరాన్ని నయం చేసేందుకు కూడా ఈ మొక్క పొడిని ఉపయోగిస్తారు.

 
ఈ మొక్క మొత్తాన్ని తీసుకుని మెత్తగా పేస్టులా చేసి కొద్దిగా ఆవు పాలలో కలిపి తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. వీటి ఆకులను మండించి వాటి వాసన చూస్తే ఆస్తమా వ్యాధి తగ్గుతుందని చెపుతారు. వీటి ఆకులను పేస్టులా చేసి తలకు పట్టిస్తే జుట్టు బలంగా నిగనిగలాడుతుంది. ఐతే విష్ణుక్రాంతి కషాయాన్ని తీసుకునేవారు నిపుణులైన ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వాడుకోవాలి.