శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (16:35 IST)

ఉసిరికాయ తినండి.. నిత్య యవ్వనులుగా ఉండండి.!

ఉసిరికాయ తినండి.. నిత్య యవ్వనులుగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉసిరి కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది శరీరానికి కావలసిన ఎనర్జీని ఇస్తుంది. అంతేగాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

మధుమేహగ్రస్థులు తరచూ ఉసిరికాయను తినడం ద్వారా నిత్యయవ్వనులుగా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉసిరి కాయలో క్యాల్షియం, ఐరన్ ధాతువులు.. జుట్టును నెరసిపోకుండా చేస్తుంది. కేశ సంరక్షణలో ఉసిరికాయ కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టుకు బలాన్నివ్వడమే కాకుండా హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. 
 
ఆరోగ్యపరంగా చూస్తే.. హృద్రోగ సమస్యలను ఉసిరికాయ దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తినిచ్చే ఉసిరికాయ గుండెపోటును నియంత్రిస్తుంది. ఇంకా కంటి దృష్టి లోపాలను నయం చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యల్ని నయం చేస్తుంది. వయస్సు మీద పడినా ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా యంగ్‌గా కనిపిస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.