బలమైన గుండె కోసం ఏం చెయ్యాలి?

మంగళవారం, 31 జనవరి 2017 (20:03 IST)

cardiac arrest - heart attack

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పుడూ పని బిజీలో ఉండటం వ్యాయామం చేయకపోవడంతో గుండెనొప్పి వస్తోంది. అలాంటి గుండె నొప్పి రాకుండా ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
 
తెల్ల మిరియాలను పొడి చేసుకొని ఒక చెంచా పొడిని గ్లాస్ నీళ్ళలో కలుపుకుని రోజూ త్రాగితే గుండె జబ్బులు రావు. మల్లెపూలతో చేసిన టీ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రోజూ కాసిన్ని ఎండు ద్రాక్ష తింటే గుండె బలంగా ఉంటుంది.
 
ఎండు అంజూరపు పళ్ళను జీలకర్రను సమ భాగాలుగా కలిపి పొడి చేసుకొని చెంచా తేనెలో కలిపి రోజూ తీసుకొంటే గుండెదడ, గుండెపోటు వంటివి రావు. అక్రూట్ కాయలు గుండెకు ఎంతో మంచివి.
 
లేత చింతచిగురు, గుండెకు చాలా మంచిది. దానిని కూరలలో వేసుకొని కానీ పొడి చేసుకొని కానీ తినవచ్చు. చిటికెడు కుంకుమపువ్వును కొంచెం నిమ్మరసంలో కలిపి పుచ్చుకుంటే గుండె బలంగా ఉంటుంది. దానిమ్మ గింజలు, దానిమ్మ ఆకుల రసం అన్ని రకాల గుండె జబ్బులను నివారిస్తుంది.
 
చెంచా ఉసిరికాయ పొడిలో చెంచా తేనె కలిపి రోజూ తీసుకొంటే గుండెకు మంచిది. నాలుగు లేక ఐదు వెల్లుల్లి దెబ్బలను నేతిలో వేయించి రోజూ మధ్యాహ్న భోజనానికి ముందు తింటే గుండె బలంగా ఉంటుంది. ఇది వార్థక్యాన్ని కూడా అదుపులో ఉంచుతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఒక్కసారి చుంబించాడు... ఆ తర్వాత కనబడకుండా పోయాడు... ఫోన్ చేస్తే....

మేమిద్దరం పెళ్లియిన వేర్వేరు వ్యక్తులం. ఏడు నెలల క్రితం అతడితో పరిచయం ఏర్పడింది. ఎంతో ...

news

బిర్యానీ ఆకుతో చుండ్రుకు చెక్ పెట్టండి.. శీతాకాలంలో ఆకుకూరలు తీసుకోండి..

బిర్యానీ ఆకుతో చుండ్రును సులభంగా దూరంగా చేసుకోవచ్చు. బిర్యానీ ఆకును నీటిలో కలిపి వేడి ...

news

జలుబు చేసిందా..? అయితే చామంతి రేకుల్ని మరిగించి?

జలుబు చేసిందా..? తరచూ తుమ్ములు వస్తున్నాయా? అయితే అరకప్పు చామంతి రేకులను ఒక గ్లాసుడు ...

news

వేడి వేడి పాలలో బెల్లం కలుపుకుని తాగితే.. బరువు తగ్గుతారు.. చుండ్రు మటాష్

బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలెన్నో వున్నాయి. రుతు స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వ‌చ్చే ...