బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (16:14 IST)

బరువు తగ్గాలనుకుంటే.. లవంగం, దాల్చినచెక్క పొడితో.. తేనెను కలుపుకుని?

లవంగాల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలాగే తేనెలోనూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండింటిని కలుపుకుని తీసుకోవడం ద్వారా వాటిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్

లవంగాల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలాగే తేనెలోనూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండింటిని కలుపుకుని తీసుకోవడం ద్వారా వాటిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సంబంధిత రోగాలను లవంగం దూరం చేస్తుంది. శరీర అవయవాలు మెరుగ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్న టాక్సిన్లను లవంగం తొలగిస్తుంది. 
 
ఇదేవిధంగా కఫ దోషాలను తేనె నయం చేస్తుంది. ఆయాసం, సైనస్, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. తేనెను రోజూ ఓ స్పూన్ తీసుకోవాల్సిందే. ఆస్తమా, ఒబిసిటీ వేధిస్తుంటే.. ఉదయం, రాత్రి పూట ఒక టేబుల్ స్పూన్ లవంగం, దాల్చిన చెక్క పొడిని తీసుకుని అందులో తేనె కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
బరువు తగ్గాలనుకునే వారు దాల్చిన చెక్క, లవంగం పొడిని తేనెలో కలుపుకుని మూడు నెలల పాటు తీసుకుంటే సరిపోతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు తేనె కలిపిన లవంగం, దాల్చిన చెక్క పొడి పేస్టును రాస్తే ఉపశమనం లభిస్తుంది.