శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2015 (17:22 IST)

కరివేపాకుతో మేలెంతో తెలుసుకోండి..!

కరివేపాకు జీర్ణానికి మెరుగ్గా పనిచేస్తుంది. కరివేపాకు జుట్టు నెరవకుండా ఉంచుతుంది. కరివేపాకుతో కాల్చిన చింతపండు, వేయించిన ఉప్పు, మిరపకాయలు చేర్చి తీసుకుంటే పేగు వ్యాధులను దూరం చేస్తుంది. పిత్తాన్ని హరించే  గుణం కరివేపాకు ఉంది. కరివేపాకుతో మిరియాలు, ఉప్పు, జీలకర్రను చేర్చి పొడి కొట్టుకుని నెయ్యి కలిపి తీసుకుంటే ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.
 
పేగులను నశింపజేసే శక్తిని కలిగివున్న కరివేపాకు కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. జుట్టు నెరవకుండా ఉంచుతుంది. చేతులు కాళ్ళు దడపుట్టడం. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. డయాబెటిస్ వ్యాధులను దూరం చేస్తుంది. గుండెపోటును, క్యాన్సర్‌ను నియంత్రిస్తుంది. కరివేపాకులో 63 శాతం నీరు, ఒక శాతం ఫాట్, 4 శాతం ఉప్పు, 6.4 శాతం పీచు, 18.7 శాతం పిండి పదార్థాలు దాగివున్నాయి. 
 
వీటితో పాటు 100 గ్రాముల కరివేపాకులో 830 మి.గ్రాముల సున్నం, 221 మి.గ్రాముల మెగ్నీషియం, 132 మి.గ్రాముల ఐరన్, 0.21 మి.గ్రాముల విటమిన్ ఎ, క్లోరిన్ వంటివి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.