1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (17:43 IST)

కంటిని రక్షించుకునే ఆయుర్వేద చిట్కాలివిగోండి!

అలసిపోయిన కంటిని కాపాడుకునేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం ఉంటుంది. గొడుగు లేకుండా ఎండలో తిరగడం ద్వారా కళ్లు ఎర్రబడితే.. నిమ్మ, నీరు సమపాళ్లలో తీసుకుని మృదువైన కాటన్‌తో కళ్లను మూసి కనురెప్పలపై మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కంటికి విశ్రాంతి ఇవ్వాలంటే ఓ పది నిమిషాల పాటు చీకటిలో కూర్చుని తర్వాత మెల్లగా కళ్లు తెరవడం చేస్తే కళ్లు ఎర్రబడటాన్ని నివారించవచ్చు. 
 
రాత్రి బాగా పండిన నిమ్మను రెండు కళ్లకు కట్టుకుని అర్థగంటసేపు అలాగే ఉంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా కంటికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటే కీరదోస ముక్కలను అరగంట పాటు కళ్లపై ఉంచండి. తర్వాత తీసేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఇంకా టీ ఆకు నీటిని కాటన్‌లో ముంచి అప్పడప్పుడు కనురెప్పలకు వత్తుకుంటూ శుభ్రం చేసుకుంటే కళ్లు ఎర్రబడవు. కంటినొప్పి ఏర్పడేందుకు ముందే కళ్లు ఎర్రబడతాయి. అందుచేత కళ్లు ఎర్రబడితే తప్పకుండా డాక్టర్లను సంప్రదించడం చేయాలి. నిర్లక్ష్యం కూడదు.