శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (12:34 IST)

జామ ఆకుల్లో అంత పవరుందా?

జామఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాన్సర్‌కు జామ ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. జామ ఆకుల్లో కాన్సర్‌ను నిరోధించే గుణాలున్నాయి. కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది. కణాలను కాపాడుతుంది. కాన్సర్ మందుల కంటే... జామ రసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపించగలదని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
జామ ఆకుల్లో విటమిన్ సీ ఉంటుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఓ ఆరెంజ్ తింటే వచ్చే సీ విటమిన్ కంటే డబుల్ సీ విటమిన్ జామకాయను తింటే వస్తుంది. చర్మ వ్యాధులు రాకుండా వుండాలంటే.. జామకాయలతో పాటు జామ ఆకుల టీని రోజూ ఓ కప్పు సేవిస్తూ వుండాలి. శరీరం వేడి నుంచి తప్పించుకోవాలంటే.. జామ కాయలను తీసుకుంటూ వుండాల్సిందేనని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.