బిర్యానీ ఆకులో ఆరోగ్యం.. గర్భిణీ స్త్రీలు అలా వాడితే?
బిర్యానీలో ఉపయోగించే ఆకు వలన బిర్యానీకి ఒక రకమైన రుచి, వాసన వస్తాయి. బిర్యానీ ఆకులో విటమిన్ బి, పాంటోధెనిక్ ఆమ్లం, ఫైరాడిక్సిన్, రైబో ఫ్లేవిన్ అధికంగా లభిస్తాయి. శరీరంలోని ఎంజైముల పనితీరుని ఇవి మెరుగుపరుస్తాయి. నాడీవ్యవస్థ పనితీరు, జీవక్రియలను మెరుగుపరచడంలో బిర్యానీ ఆకు సహాయపడుతుంది.
అలాగే బిర్యానీ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి సహకరిస్తుంది. అలాగే ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ తో ఇది సమర్థవంతంగా పోరాడుతుంది
బిర్యానీ ఆకులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో జీవక్రియలు సక్రమంగా సాగడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి ఇది గర్భిణీలకు చాలా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రసవానంతరం గర్భస్థ శిశువుకు, గర్బిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. కాబట్టి గర్భిణీలు వంటకాల్లో బిర్యానీ ఆకు చేర్చుకోవడం చాలా అవసరం.
బిర్యానీ ఆకుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మెరుగైన కంటిచూపుకి సహాయపడుతుంది. కాబట్టి విటమిన్ ఎ లోపంతో బాధపడేవాళ్లు బిర్యానీ ఆకులను ఒక పూట ఆహారంలో చేర్చుకుంటే.. ఎలాంటి కంటిచూపు సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.