ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (18:13 IST)

ధనియాల నీటిని కళ్ళల్లో డ్రాప్స్‌లా వేసుకుంటే..?

ధనియాలను మసాలలా కోసం ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తాయి. నోట్లో పొక్కులు ఏర్పడినప్పుడు ధనియాల రసాన్ని నోట్లో వేసుకున పుక్కిలించేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.

ధనియాలను మసాలలా కోసం ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తాయి. నోట్లో పొక్కులు ఏర్పడినప్పుడు ధనియాల రసాన్ని నోట్లో వేసుకున పుక్కిలించేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ధనియాలు జీర్ణవ్యవస్థను మంచిగా ఉపయోగపడుతాయి. కళ్ళలో వాపు, నొప్పి, మంటగా ఉన్నప్పుడు ధనియాల పొడిని నీటిలో ఉడికించుకుని వడగట్టాలి. 
 
ఈ ధనియాల నీటిని కళ్ళల్లో డ్రాప్స్‌లా వేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి వాపు, నొప్పి, మంటలు తగ్గుతాయి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. కుదరకపోతే ఈ చిట్కా పాటించకూడదు. ముక్కు నుండి రక్తం రాకుతుంటే కొత్తిమీర రసాన్ని ముక్కులో వేసుకోవాలి. ఇలా చేస్తే రక్తం రావడం తగ్గుతుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తొలగిపోవాలంటే ధనియాల పొడిని కలకండతో కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.