అవిసె గింజలతో మహిళల్లో ఆ సమస్య వుండదట..

అవిసె గింజలు మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవిసెగింజల్లో లభించే లిగ్‌నాన్స్‌ మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. లిగ్‌నాన్స్‌కి ఈస్ట్రోజన్‌ గుణాలుండటంతో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్

selvi| Last Updated: సోమవారం, 15 జనవరి 2018 (12:38 IST)
అవిసె గింజలు మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవిసెగింజల్లో లభించే లిగ్‌నాన్స్‌ మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. లిగ్‌నాన్స్‌కి ఈస్ట్రోజన్‌ గుణాలుండటంతో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీకి ఎంతగానో తోడ్పడుతుంది.

అవిసె గింజల పొడిని రోజూ ఐదేసి గ్రాములు తీసుకుంటే.. నెలసరి క్రమబద్ధం అవుతుంది. నెలసరి సమస్యలు తొలగిపోతాయి. ఇక అవిసె గింజల్లో ఉండే మ్యుకిలేజ్ గమ్ అనే పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఈ గింజల్లోని పీచు బరువుని నియంత్రిస్తాయి. నేరుగా తీసుకోలేకపోయినా సూప్‌లు, సలాడ్‌లు, స్మూతీల్లో భాగం చేసుకోవచ్చు. ఫలితంగా జీవక్రియా రేటు మెరుగుపడుతుంది. వీటిల్లోని పోషకాలకు రొమ్ము, అండాశయ క్యాన్సర్‌ కారకాలతో పోరాడే శక్తి కూడా ఉంటుంది.

అవిసె గింజలను వేయించి పొడి చేసుకుని తింటే, నీళ్లల్లో కలుపుకుని తాగితే చర్మ ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :