బార్లీ నీటిలో నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే?

సోమవారం, 3 సెప్టెంబరు 2018 (15:42 IST)

ఈ కాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ చిట్కాలు పాటిస్తే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు నలుపుకుని గంటకోసారి వాసన పీల్చుకుంటే 6 గంటలలో జలుబు త్వరగా తగ్గుతుంది. బార్లీ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే గుండెలో మంట తగ్గుతుంది.
barley with lime
 
అల్లం రసంలో తులసి, తేనెను కలుపుకుని ప్రతిరోజూ మూడు పూటల తీసుకుంటే జలుబు వెంటనే తగ్గుతుంది. శొంఠి పొడిలో మిరియాలు, తులసి ఆకుల పొడిని వేసుకుని కషాయంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెరను కలుపుకుని వేడివేడిగా తాగితే ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి. 
 
దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని నీటితో బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులో తేనెను కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం పిండుకుని అందులో తేనెను కలుపుకుని తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా జలుబు తగ్గేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రక్తపోటును నివారించే మందార టీ..

రక్తపోటును నియంత్రించాలంటే.. మందార టీని సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ...

news

రోజూ నువ్వుల నూనెతో పళ్లు తోముకుంటే..?

రోజూ పళ్లు తోముకున్న తర్వాత చెంచా నువ్వుల నూనెతో చిగుళ్లపై మర్దనా చేసుకోవాలి. చెంచా ...

news

నొప్పులను తగ్గించేందుకు ''ఆ'' పదార్థాలు వాడితే..?

శరీంలో ఏ భాగంలోనైనా కొద్దిగా నొప్పులు వస్తే చాలు వెంటనే మెడిసిన్స్ వాడుతుంటారు. పెయిన్ ...

news

జొన్నలతో అధిక బరువు చెక్...

ఆకలిని తీర్చుకునేందుకు ఏదో ఒకటి సమయానికి తీసుకుని నిద్రలేమితో చాలామంది బాధపడుతుంటారు. ఈ ...