శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (17:30 IST)

ఉలవచారుతో బరువు తగ్గండి.. నెలసరి సమస్యలకు చెక్ పెట్టండి..

బొజ్జను తగ్గించడమే కాకుండా.. మహిళల్లో తెల్లబట్ట, నెలసరి సమస్యలను తొలగించేందుకు ఉలవలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్రసవం అయ్యాక మహిళలు ఉలవలతో చేసిన ఉండలను తీసుకోవడం మంచిదని, బియ

బొజ్జను తగ్గించడమే కాకుండా.. మహిళల్లో తెల్లబట్ట, నెలసరి సమస్యలను తొలగించేందుకు ఉలవలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్రసవం అయ్యాక మహిళలు ఉలవలతో చేసిన ఉండలను తీసుకోవడం మంచిదని, బియ్యం నూకలు, ఉలవల నూకలతో చేసిన గంజిని తాగితే ఆరోగ్యానికి బలం చేకూరుతుందని వారు సూచిస్తున్నారు. ఈ గంజిని రోజు గ్లాసుడు తీసుకోవడం ద్వారా ఎముకలు, నరాలకు మేలు జరుగుతుంది. 
 
ఉలవలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం ద్వారా బరువు తగ్గొచ్చు. శరీరంలోని మలినాలను తొలగించుకోవచ్చు. అనవసరపు కొవ్వును కరిగించుకోవచ్చు. ఇందులోని పిండిపదార్థాలు ఆరోగ్యానికి చురుకుదనాన్ని ఇస్తాయి. ఉలవలను నానబెట్టి తీసుకోవచ్చు. లేదా వేయించి తీసుకోవచ్చు. ఉడికించైనా తీసుకోవచ్చు. 
 
ఉలవలను ఉడికించి ఆ నీటిని తాగడం ద్వారా జలుబు మటాష్ అవుతుంది. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తోంది. వర్షాకాలం, శీతాకాలంలో ఉలవలతో సూప్ తయారు చేసి తీసుకోవడం మంచిది. ఉలవలను పొడికొట్టి పెట్టుకుంటే ఉలవచారు తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా రసంలో ఒక స్పూన్ ఉలవల పొడిని చేర్చితే బరువు సులభంగా తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.