గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:41 IST)

గుండెను బలంగా ఉంచాలంటే..? మల్లెపూల టీని సేవించండి..

గుండెపోటు వచ్చేందుకు ప్రధాన కారణం.. శరీరానికి శ్రమ లేకపోవడమే. బిజీలో కూర్చుని గంటల పాటు పనిచేసే వారు.. వ్యాయామం చేయకపోవడంతో గుండెనొప్పి తప్పదు. అయితే గుండెపోటు రాకుండా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసుకుంద

గుండెపోటు వచ్చేందుకు ప్రధాన కారణం.. శరీరానికి శ్రమ లేకపోవడమే. బిజీలో కూర్చుని గంటల పాటు పనిచేసే వారు.. వ్యాయామం చేయకపోవడంతో గుండెనొప్పి తప్పదు. అయితే గుండెపోటు రాకుండా ఉండాలంటే..  ఏం చేయాలో తెలుసుకుందాం.. తెల్ల మిరియాలను పొడి చేసుకొని ఒక చెంచా పొడిని గ్లాస్ నీళ్ళలో కలుపుకుని రోజూ తాగితే గుండె జబ్బులు రావు. మల్లెపూలతో చేసిన టీ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రోజూ కాసిన్ని ఎండు ద్రాక్ష తింటే గుండె బలంగా ఉంటుంది.
 
అలాగే దానిమ్మ గింజలు, దానిమ్మ ఆకుల రసం అన్ని రకాల గుండె జబ్బులను నివారిస్తుంది. చెంచా ఉసిరికాయ పొడిలో చెంచా తేనె కలిపి రోజూ తీసుకొంటే గుండెకు మంచిది. నాలుగు లేక ఐదు వెల్లుల్లి దెబ్బలను నేతిలో వేయించి రోజూ మధ్యాహ్న భోజనానికి ముందు తింటే గుండె బలంగా ఉంటుంది. ఇది వార్థక్యాన్ని కూడా అదుపులో ఉంచుతుంది.
 
ఇంకా గుండె బలంగా ఉండాలంటే అంజూర పండ్లను జీలకర్రను సమ భాగాలుగా కలిపి పొడి చేసుకుని చెంచా తేనెతో కలిపి రోజూ తీసుకుంటూ వస్తే గుండెపోటు దరిచేరదు. అక్రూట్ పండు కూడా గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.