శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (11:18 IST)

తరచుగా అయ్యే గర్భస్రావాలను అరికట్టే ఆవాలు..

ఆవాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తరచుగా అయ్యే గర్భస్రావాలను అరికట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గర్భిణీలు వీటిని తీసుకోవడం ద్వారా.. గర్భస్థ శిశువుకి హానిచేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి.

ఆవాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తరచుగా అయ్యే గర్భస్రావాలను అరికట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గర్భిణీలు వీటిని తీసుకోవడం ద్వారా.. గర్భస్థ శిశువుకి హానిచేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి. చర్మవ్యాధులతో బాధపడేవారు ఆవనూనె రాసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఆవాల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొవ్వులు పుష్కలంగా వుంటాయి. ఆవాల్లో విటమిన్ బి3 చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ప్రతి రోజు ఆవాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
 
మొటిమలను తగ్గించుకోవాలంటే.. కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి చల్లారిన తర్వాత ఆ నూనెను వడగట్టి రాత్రి నిద్ర పోవడానికి ముందు నీటితో ఈ నూనెను కలిపి ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇగి జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఆవాలను మోతాదుకు మించి ఒకేసారిగా ఎక్కువగా వాడితే టాక్సిక్ కారణంగా ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.