1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (16:55 IST)

ఉల్లిపాయల్లో ఏముందో తెలుసుకోండి..!

ఉల్లిపాయల్లో రకాలున్న సంగతి తెలిసిందే. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే విషయం తెలిసిందే. అయితే ఉల్లిపాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. ఉల్లిపాయల్లో విటమిన్ సి, విటమిన్ బి2 వంటి ధాతువులు ఉన్నాయి.

అంతేగాకుండా విటమిన్ ఎ, విటమిన్ కె కూడా ఉల్లిలో ఉన్నాయి. ఇవేగాకుండా.. కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, పీచు ఉన్నాయి. మధుమేహాన్ని నియంత్రించాలంటే ఉల్లిని తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఉల్లిపాయలో యాంటీ- బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. జీర్ణ సమస్యలకు ఉల్లి చెక్ పెడుతుంది. ఉల్లిలోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇంకా ఉల్లిపాయలో ఉన్న కార్బొహైడ్రేట్ పెద్ద పేగు క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. కంటి చూపుకు మేలు చేసే ఉల్లిపాయలు.. దృష్టిలోపం, కంటి సమస్యలను నయం చేస్తుంది.  
 
ఇంకా ఉల్లిపాయ గుండె ఆరోగ్యానికి మంచిది. ఉల్లి శరీరంలోని కొవ్వును కరిగించి గుండెకు మేలు చేస్తుంది. ఇందులోని సల్ఫర్.. రక్తపోటును నియంత్రించింది. ఉల్లిలోని క్రోమియం మధుమేహాన్ని నిరోధిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గ్లోకోజ్ స్థాయుల్ని పెంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్‌‍గా పనిచేసే ఉల్లిపాయను వంటల్లో అధికంగా తీసుకోవడం ద్వారా జలుబు, జ్వరంతో పాటు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.