గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 మే 2021 (19:11 IST)

ఆస్తమాకు చెక్ పెట్టే యాలకులు.. ఇన్ఫెక్షన్లకు విరుగుడు

యాలకులు ఊపిరితిత్తుల్లో ఏర్పడే సమస్యలను దూరం చేస్తాయి. ఇప్పుడున్న కరోనా కాలంలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరకుండా వుండాలంటే యాలకులను డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. యాలకులను టీ రూపంలో తీసుకోవచ్చు. 
 
అయితే కేవలం రోజుకి ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే.. యాలకుల ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. దీని కారణంగా ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా చేరకుండా ఉంచుతుంది మరియు ఆస్తమా పేషెంట్స్ కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
 
అంతేగాకుండా.. యాలకుల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తాయి. కాలుష్యం నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యల్ని దరి చేరకుండా ఉంచుతుంది.